Share News

Bride and Groom Viral Video: ఈ వరుడు మరీ ఫాస్ట్‌గా ఉన్నాడుగా.. కెమెరామెన్‌కు ఎలా షాకిచ్చాడంటే..

ABN , Publish Date - Nov 02 , 2025 | 12:47 PM

వధూవరులకు ఫొటోషూట్ చేస్తుంటారు. ఈ సందర్భంగా నీరు, కొండలు, పచ్చని చెట్లు ఉన్న ప్రాంతంలో ఫొటోషూట్ స్టార్ట్ చేశాడు. వధూవరులకు కెమెరామెన్ వివిధ రకాల యాంగిల్స్‌లో ఫొటోలు తీస్తున్నాడు. ఈ క్రమంలో..

Bride and Groom Viral Video: ఈ వరుడు మరీ ఫాస్ట్‌గా ఉన్నాడుగా.. కెమెరామెన్‌కు ఎలా షాకిచ్చాడంటే..

వధూవరులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఫొటోషూట్ సమయంలో వధూరుల మధ్య కొన్నిసార్లు వింత ఘటనలు చోట చేసుకుంటే.. మరికొన్నిసార్లు పెళ్లి మంటపంపై విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనల్లో కొన్ని అందరికీ నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని వీడియోలు అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వధూవరులకు ఫొటోలు చూస్తుండగా కెమెరామెన్‌కు షాకింగ్ అనుభవం ఎదురైంది. వరుడు ఏం చేశాడో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వధూవరులకు ఫొటోషూట్ చేస్తుంటారు. ఈ సందర్భంగా నీరు, కొండలు, పచ్చని చెట్లు ఉన్న ప్రాంతంలో (Bride and groom photoshoot) ఫొటోషూట్ స్టార్ట్ చేశాడు. వధూవరులకు కెమెరామెన్ వివిధ రకాల యాంగిల్స్‌లో ఫొటోలు తీస్తున్నాడు. ఈ క్రమంలో వరుడు వధువుకు ముద్దు పెట్టే సీన్ తీయాల్సి వస్తుంది. దీంతో వధువు నుదిటిపై ముద్దు పెట్టమని వరుడికి కెమెరామెన్ సూచించాడు.


వరుడు కూడా అతను చెప్పినట్లుగా వధువు నుదుటిపై ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ముద్దు పెట్టిన తర్వాత.. అతడికి సందేహం కలుగుతుంది. కెమెరామెన్ వైపు చూస్తూ.. ఇలాంటివి చూస్తే అందరికీ ఇబ్బందిగా ఉంటుందని అంటాడు. దీనికి కెమెరామెన్.. అలాగైతే మీకు ఎలా కంఫర్ట్‌గా ఉంటే అలాగే చేయండి అని బదులిచ్చాడు. చివరకు వరుడు.. (Groom Kissed the Bride on The Lips) వధువుకు లిప్‌టూలిప్ కిస్ ఇచ్చేశాడు. చూసేవారికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పిన వరుడు.. చివరికి ఇలా ఏకంగా లిప్‌టూలిప్ కిస్ ఇవ్వడం చూసి కెమెరామెన్ అవాక్కయ్యాడు.


ఇదంతా పక్కనున్న వ్యక్తి వీడియో తీశాడు. చూస్తుంటే ఇదంతా నవ్వుకోవడానికి చేసినట్లుగా అనిపిస్తున్నా కూడా.. వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘చివరికి కెమెరామెన్ అసౌకర్యానికి గురయ్యాడుగా’.. అంటూ కొందరు, ‘ఈ వరుడు మరీ ఫాస్ట్‌గా ఉన్నాడుగా’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.33 లక్షలకు పైగా లైక్‌లు, 4.4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

లగేజీ చూసి.. అంతా లారీ అని అనుకున్నారు.. చివరకు ముందు వైపు చూసి షాక్ అయ్యారు..

రోడ్డు పక్కన పొదల్లో పడిపోయిన యువతి.. సమీపానికి వెళ్లి చూడగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 02 , 2025 | 12:47 PM