Speeding Car Viral Video: గుండె ఆగిపోయే సీన్.. కళ్లు చెదిరే వేగంతో దూసుకెళ్లిన కారు.. చివరకు జరిగింది చూస్తే..
ABN , Publish Date - Nov 02 , 2025 | 10:21 AM
కొందరు స్నేహితులు కలిసి కారులో వెళ్తున్నారు. అయితే హైవే రోడ్డు మీదకు వెళ్లగానే.. కారు నడుపుతున్న వ్యక్తికి పూనకం వస్తుంది. ఒక్కసారిగా కారు వేగాన్ని పెంచాడు. 50 కాదు, 100 కాదు.. ఏకంగా 180 కిలోమీటర్ల వేగంతో వాహనాన్ని నడిపాడు. దీంతో..
అధిక వేగం అత్యంత ప్రమాదకరమని తెలిసినా.. చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కొందరైతే మరీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారు ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటివారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు రోజూ అనేక ప్రమాద ఘటనలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వద్దన్నంటున్నా కూడా ఓ వ్యక్తి తన కారును 180కిలోమీటర్ల వేగంతో నడిపాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు స్నేహితులు కలిసి కారులో వెళ్తున్నారు. అయితే హైవే రోడ్డు మీదకు వెళ్లగానే.. కారు నడుపుతున్న వ్యక్తికి పూనకం వస్తుంది. ఒక్కసారిగా కారు వేగాన్ని పెంచాడు. 50 కాదు, 100 కాదు.. ఏకంగా 180 కిలోమీటర్ల వేగంతో వాహనాన్ని నడిపాడు. దీంతో పక్కన ఉన్న వ్యక్తి.. నిదానంగా వెళ్లమని వారిస్తూనే ఉన్నాడు. అయినా ఆ వ్యక్తి వినిపించుకోకుండా (speeding car) కారును వేగంగా నడుపుతున్నాడు.
వెనుక సీటులో ఉన్న వ్యక్తి తన ఫోన్‌లో వీడియో తీసుకుంటూ.. వేగంగా వెళ్లమంటూ కారును నడుపుతున్న వ్యక్తిని రెచ్చగొడుతున్నాడు. దీంతో అతను మరింత రెచ్చిపోయి వేగాన్ని పెంచేశాడు. ఇలా వెళ్తుండగా.. రోడ్డు మలుపు వద్ద అదుపు చేయలేక, ఒక్కసారిగా (car accident) కారు బోల్తా పడింది. తర్వాత చూస్తే కారు మొత్తం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. కారు పూర్తిగా దెబ్బతిన్నట్లు వీడియోలో చూడొచ్చు.
ఇలా నిర్లక్ష్యంగా వాహనం నడిపి.. మిగతా వారి ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలాంటి వారి వల్లే ప్రమాదలు జరుగుతున్నాయి’.. అంటూ కొందరు, ‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2100కు పైగా లైక్‌లు, 2.66 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
లగేజీ చూసి.. అంతా లారీ అని అనుకున్నారు.. చివరకు ముందు వైపు చూసి షాక్ అయ్యారు..
రోడ్డు పక్కన పొదల్లో పడిపోయిన యువతి.. సమీపానికి వెళ్లి చూడగా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి