Home » Accident
ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించారు. స్థానిక పృథ్వీనాథ్ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్తున్న క్రమంలో బొలెరో కారు అదుపు తప్పి కాలువలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో డ్రైవర్ మినహా అందరూ మరణించారు.
తన స్నేహితుడి ప్రేమ వ్యవహారంలో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు వెళ్లిన ఓ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. కారుతో ఢీకొట్టించి మరీ దుండగులు అతడిని పొట్టనపెట్టుకున్నారు. అన్నానగర్ తిరుమంగళం ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
చెల్లకెర పట్టణ సమీపంలోని స్టేట్ హైవే 150ఏ పై కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో అక్కాతమ్ముడు దుర్మరణం చెందారు. చెల్లకెర పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం చెల్లకెర తాలూకా తలకు గ్రామ పంచాయతీ సభ్యుడు రవికుమార్ భార్య మంజుల(32) ఆమె తమ్ముడు అభిషేక్(28) ఇద్దరూ ద్విచక్రవాహణంలో దేవరకోట మొరార్జీ స్కూల్‌కు వెళ్తున్నారు.
పిల్లలను స్కూటీపై ఎక్కించుకొని పాఠశాల వద్ద దించి వస్తుండగా మృత్యు రూపంలో వచ్చిన వాటర్‌ట్యాంకర్ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను బలితీసుకుంది. మణికొండ-పుప్పాల్‌గూడ పైపులైను రోడ్డులో సుందర్‌గార్డెన్ సమీపంలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
వర్షానికి ఓ కాలనీ సందులో వర్షపు నీరు నిలిచి ఉంటుంది. ఇంతలో ఓ మహిళ గొడుగు పట్టుకుని తన ఇంటికి వస్తుంది. డోరు తీసి ఇంట్లోకి అడుగు పెట్టి.. తర్వాత డోరు వేసేస్తుంది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని విధంగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
ట్రక్కు డ్రైవర్‌ను ఖోపోలి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రమాదం సమయంలో అతను తాగిలేడని వైద్య పరీక్షలో వెల్లడైంది. కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు.
దారి తెలియకపోవడంతో ఓ మహిళ గూగుల్ మ్యాప్‌ను అనుసరిస్తూ వెళ్లింది. అయితే మార్గ మధ్యలో ఆమెకు షాకింగ్ అనుభవం ఎదురైంది. రోడ్డుపై వెళ్లాల్సిన కారు కాస్తా.. నీటి గుంటలో పడిపోయింది. చివరకు ఏమైందంటే..
కెమికల్ అనే ఫ్యాక్టరీ బయట ఆగిన లోడ్ లారీ ఆగి ఉంది. అందులోని వస్తువులను దించిన తర్వాత.. లారీ డ్రైవర్ రామ్‌లాల్ గాద్రి (40) టార్పాలిన్ పక్కన పెట్టేందుకు వాహనం పైకి ఎక్కాడు. అయితే ఈ క్రమంలో చూసుకోకుండా చేసిన చిన్న తప్పుతో చివరకు అతడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది..
పాశమైలారం సిగాచీ దుర్ఘటన నివేదికపై ఈ నెల 28న ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. సిగాచీ ప్రమాదంపై నిపుణుల కమిటీ సూచించిన నిర్ణయాలపై చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
అదృశ్యమైన రష్యన్ ప్యాసింజర్ విమానం కుప్పకూలినట్లు తెలిసింది. 43 మంది ప్రయాణికులతో టిండా బయలుదేరిన ఏఎన్-24 విమానం చైనా సరిహద్దుల్లోని అముర్ ప్రాంతంలో కుప్పకూలింది.