Share News

TG Road accidents: రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి.. మరో ఘటనలో కారు దగ్ధం..

ABN , Publish Date - Dec 01 , 2025 | 06:49 AM

రాష్ట్రంలో ఈ తెల్లవారుజామున వరుస ప్రమాదాలు సంభవించాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో ఘటనలో ఇంజిన్‌లో మంటలు చెలరేగి కారు దగ్ధమైంది.

TG Road accidents: రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి.. మరో ఘటనలో కారు దగ్ధం..
Man dies

హైదరాబాద్, డిసెంబర్ 01: రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున వరుస ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కాచిగూడ(Kachiguda) పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లైఓవర్(Flyover) పై నుంచి పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు.. కాచిగూడ నుంచి అంబర్‌పేట వైపునకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బైక్‌పై బయల్దేరిన ఆ వ్యక్తి.. ఛే(ఆరో) నంబర్ చౌరస్తా వద్దకు చేరుకున్న తర్వాత అక్కడి డివైడర్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో ఫ్లైఓవర్ మీది నుంచి కింద పడిపోయాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


నల్గొండ(Nalgonda) జిల్లాలో జరిగిన మరో ప్రమాద ఘటన జరిగింది. నార్కట్‌పల్లి(Narkatapalli)లోని నల్గొండ ఎక్స్ రోడ్ వద్ద రాత్రివేళ డీసీఎం వాహనం అదుపుతప్పి షాపులలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నార్కట్‌పల్లికి చెందిన అభిరామ్(21) అనే వ్యక్తి మృతి చెందాడు.


నల్గొండ జిల్లాలోనే జరిగిన మరో ఘటనలో ఓ కారు దగ్ధమైంది. నార్కట్‌పల్లి - హైదరాబాద్
(Nalgonda - Hyderabad Highway) రహదారిపై పూజిత హోటల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ(Vijayawada)కు వెళ్తున్న క్రమంలో కారు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు.


ఇవీ చదవండి:

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్టే విధించలేం: హైకోర్టు

ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన

Updated Date - Dec 01 , 2025 | 11:47 AM