Share News

Kurnool Accident: ఎమ్మిగనూరు సమీపంలో రెండు కార్లు ఢీ.. ఐదుగురు మృతి

ABN , Publish Date - Nov 29 , 2025 | 06:46 AM

కర్నూలు జిల్లా పరిధిలో ఈ రోజు ఉదయాన్నే రెండు ప్రమాదాలు సంభవించాయి. ఎమ్మిగనూరు పరిధిలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. తుగ్గలి పరిధిలో ఓ బస్సు బోల్తాపడిన మరో ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి.

Kurnool Accident: ఎమ్మిగనూరు సమీపంలో రెండు కార్లు ఢీ.. ఐదుగురు మృతి
Accdient

కర్నూలు జిల్లా, నవంబర్ 29: జిల్లా పరిధిలో శనివారం ఉదయం రెండు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని కొటేకల్ గ్రామం వద్ద ఓ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది(Yemmiganur Accident). రెండు కార్లు ఢీకొన్న ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఐదుగురు మృత్యువాత పడ్డారు(Two cars collided). మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆదోని(Adoni)కి తరలించారు.


కర్ణాటక(Karnataka) నుంచి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం దర్శనం కోసం మంత్రాలయం(Mantralayam) వెళ్తుండగా.. కోటేకల్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరిని కర్ణాటక రాష్ట్రం కోలార్(Kolar) జిల్లా చిక్కహోసల్లి గ్రామానికి చెందిన.. వెంకటేశప్ప(60), ఆయన కూతురు మీనాక్షి(32), అల్లుడు సతీశ్(36), మనవళ్లు రుత్విక్, బన్నీగౌడ్‌లుగా తేల్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరో ప్రమాదం..

బెంగళూరు(Bengaluru) నుంచి మంత్రాలయం వెళ్తున్న కర్ణాటక బస్సు పత్తికొండ పరిధిలోని తుగ్గలి, రాతన గ్రామాల మధ్య బోల్తాపడింది(Bus overturned). ఆ సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. వారిలో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.


ఇవీ చదవండి:

7 గ్రామాలు.. 16,666 ఎకరాలు

రాజీ వెనుక రహస్యమేంటో?

Updated Date - Nov 29 , 2025 | 07:49 AM