Truck Overturns: అతివేగంతో ట్రక్ ఫల్టీలు.. షాకింగ్ వీడియో
ABN , Publish Date - Nov 26 , 2025 | 01:57 PM
విపరీతమైన వేగం ప్రాణాలు హరిస్తుందన్న విషయాన్ని పదే పదే ట్రాఫిక్ ప్రకటనల ద్వారా తెలియచేస్తున్నా కొందరు డ్రైవర్లు పట్టించుకోవడం లేదు. ఫలితంగా వాళ్ల ప్రాణాలే కాకుండా, వాహనంలోని ప్రయాణికుల ప్రాణాలు కూడా హరిస్తున్నాయి. ఈ షాకింగ్ వీడియో చూస్తే..
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలోని మడికేరి–సోమవార్‌పేట రాష్ట్ర రహదారిపై ఘోర ప్రమాదం నెలకొంది. నాగూర్ సమీపంలో వేగంగా వెళ్తున్న పికప్ ట్రక్ ఒక్కసారిగా బోల్తా పడింది. డ్రైవర్ అధిక వేగంతో అకస్మాత్తుగా మలుపు తిప్పినట్టు సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. అయితే, టైర్ బరస్ట్ కావడంతోనే ప్రమాదం జరిగిందని డ్రైవర్ అంటున్నాడు.
విజువల్స్‌లో కనిపిస్తున్న ప్రకారం వేగంగా ట్రాన్స్ పోర్ట్ ఆటో వస్తూ మలుపు తీసుకుంటోంది. అయితే, ఉన్నఫళంగా ఆటో టర్న్ తిరిగింది.. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో పికప్ ట్రక్ రెండుసార్లు పల్టీలు కొట్టి ఆగిపోయింది. దీంతో వాహనంలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా కిందపడ్డారు. ఆటో వేగంగా వాళ్ల మీదకి ఫల్టీ కొడుతూ దూసుకొచ్చింది. వెంట్రుకవాసిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా, ఒక వ్యక్తి ఆటో కింద చిక్కుకున్నాడు.
ప్రమాదాన్ని చూసిన స్థానికులు తక్షణమే ప్రమాద స్థలానికి చేరుకుని గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ దురదృష్టకర ఘటన అతివేగం వల్ల కలిగే ప్రమాదాలను మరోసారి గుర్తు చేసింది. ముఖ్యంగా వంపు తిరిగిన హైవేల మీద.. కొండ మార్గాల్లో ఒక్క క్షణం ర్యాష్ డ్రైవింగ్ అనేక మంది ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంది. వారి కుటుంబాల్ని విషాదంలోకి నెడుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇవాళ పెరిగిన వెండి, బంగారం ధరలు
మావోయిస్టుల కస్టడీ పిటిషన్ వెనక్కి
Read Latest Telangana News and National News