Home » Karnataka
అక్కడ.. అధికారులే అమ్మా.. నాన్న అయ్యారు. పునరావాస కేంద్రంలో ఉన్న మహిళలకు స్థానిక, ఉన్నతాధికారులే దగ్గరుండి పుళ్లి జరిపించారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు పెళ్లిపెద్దలుగా మారి ఆ వివాహాలను జరిపించారు. ఇక వివరాల్లోకి వెళితే...
మాజీ మంత్రి కుమారుడి కారు ఢీకొని ఓ యువకుడు దుర్మరణం పాలైన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల అమలు కమిటీ అధ్యక్షుడు హెచ్ఎం రేవణ్ణ కుమారుడు శశాంక్ కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో రాజేశ్ అనే మువకుడు దుర్మరణం పాలయ్యాడు.
కళ్లకు గంతలు కట్టుకుని ఓ విద్యార్థిని పరీక్ష రాస్తూ.. అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. హిమబిందు అనే బాలిక 8వ తరగతి పరీక్షలు రాస్తోంది. అయితే.. గాంధారి విద్య సహాయంతో కళ్లకు గంతలు కట్టుకుని తన 8వ తరగతి పరీక్షలు రాస్తోంది.
పెంపుడు చిలుకను రక్షించబోయి ఓ వ్యక్తి దుర్మరణం పాలైన విషాద సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. అరుణ్‌కుమార్ అనే వ్యక్తి 2 లక్షల రూపాయలు వెచ్చించి విదేశీ పెంపుడు చిలుకను కొనుగోలు చేశాడు. అయితే.. ఇంటిముందున్న కరెంట్ స్తంభంపై వాలగా దాన్ని రక్షించే ప్రయత్నంలో విద్యుత్ షాక్ కు గురై మృతిచెందాడు.
కర్ణాటక రాష్ట్రంలోని మండ్యా జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయి ప్రవర్తించారు. స్కూల్ బస్సు ఆపి రచ్చ రచ్చ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అమ్మా నన్ను క్షమించు.. ప్రేమ పేరుతో మోసపోయాను.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా... అంటూ ఓ యువతి తల్లికి లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా సంచలనం కలిగించిన ఈ విషయానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. నేనే నిజమైన ప్రతిపక్షనేతను.. అడ్జ్స్ట్మెంట్ రాజకీయ నేతను కాను.. అంటూ ఆయన చేసిన కామెంట్స్.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి.
మా రక్తంలో కన్నడ ఉంది.. ఆ పాఠశాలలను మూసే ప్రసక్తే లేదు.. అన్నారు ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మధుబంగారప్ప. అలాగే.. 500 పబ్లిక్ స్కూల్స్‌ను ప్రారంభిస్తామని ప్రకటించామని, అందుకు అనుగుణంగానే 309 పాఠశాలలు ప్రగతి దశలో ఉన్నాయన్నారు.
హీరో దర్శన్ మళ్లీ.. వివాదంలో చిక్కుకున్నారు. పరప్పన అగ్రహార జైలులో ఉన్న ఆయన తోటి ఖైదీలతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలొస్తున్నాయి. రేణుకాస్వామి హత్య కేసులో హీరో దర్శన్ కు సంబంధం ఉందన్న ఆరోపణలతో ఆయన ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతున్నారు.
తన వద్ద రూ.9 లక్షలు విలువచేసే రోలెక్స్, రూ.23.9 లక్షలు, రూ.12.06 లక్షలు విలువ చేసే రెండు కార్టియర్ వాచ్‌లు ఉన్నట్టు లోకాయుక్తకు తాను అఫిడవిట్ సమర్పించినట్టు డీకే శివకుమార్ తెలిపారు. ఆ డాక్యుమెంట్ కాపీని కూడా ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో షేర్ చేశారు.