Viral Video: సమయానికి దేవుడిలా రావడమంటే ఇదే.. కారు డ్రైవర్‌ను ఎలా కాపాడాడో చూస్తే..
ABN , Publish Date - Nov 30 , 2025 | 09:06 PM
ఓ కారు ప్రమాదవశాత్తు స్థానికంగా ఉన్న చెరువులో పడిపోయింది. ఈ క్రమంలో కారు నడుపుతున్న వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. మరోవైపు కారు కొద్దికొద్దిగా మునిగిపోతోంది. దీన్ని గమనించిన ఓ వ్యక్తి ..
సమయానికి దేవుడిలా వచ్చారు.. అని చాలా సందర్భాల్లో అంటుంటాం. ప్రమాదంలో ఉన్న వారు కొన్నిసార్లు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడుతుంటారు. చివరి నిముషంలో ఎవరో ఒకరు ఎంటరై బాధితులను రక్షిస్తుంటారు. ఇలాంటి సీన్లు సినిమాల్లోనే కాదు.. అప్పుడప్పుడూ మన కళ్ల ముందు కూడా జరుగుతుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చెరువులో పడిన కారు మునిగిపోతోంది. అదేసమయంలో ఓ వ్యక్తి పడవలో అక్కడికి చేరుకున్నాడు. చివరకు కారులోని వ్యక్తిని ఎలా కాపాడాడో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) పిలిభిత్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కారు ప్రమాదవశాత్తు స్థానికంగా ఉన్న చెరువులో పడిపోయింది. ఈ క్రమంలో కారు నడుపుతున్న వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. మరోవైపు కారు కొద్దికొద్దిగా మునిగిపోతోంది. దీన్ని గమనించిన ఓ వ్యక్తి పడవలో అక్కడికి వెళ్లాడు. పడవపై నిలబడి కారులోని వ్యక్తిని బయటికి లాగేందుకు ప్రయత్నించాడు. కారు డోరు నుంచి అతన్ని బయటికి లాగేందుకు ఎంతో ప్రయత్నించాడు.
అయితే ఆ వ్యక్తి స్పృహలో లేకపోవడంతో బయటికి లాగడం చాలా కష్టమైంది. అయినా పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇంతలో కారు పూర్తిగా మునిగిపోయింది. అలాగే పడవ కూడా నీటిలోకి మునిగింది. అయినా ఆ వ్యక్తి మాత్రం ఏమత్రం భయపడకుండా లోపల ఉన్న వ్యక్తిని చివరకు బయటికి లాగేశాడు. ఇంతలో ఒడ్డున ఉన్న వారు నీటిలో ఈదుకుంటూ అక్కడికి వెళ్లి, అతన్ని బయటికి తీసుకురావడంలో సాయం చేశారు. అతన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా కారులోని వ్యక్తిని (Man Saved Car Driver) కాపాడిన వ్యక్తిని అంతా అభినందనలతో ముంచెత్తారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ వ్యక్తి నిజంగా దేవుడిలా వచ్చి సాయం చేశాడు’.. అంటూ కొందరు, ‘మంచితనం ఇంకా బతికి ఉందనే దానికి ఇదే నిదర్శనం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లు, 24 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పెళ్లి వేదికపై డబ్బు వెదజల్లిన మహిళ.. వరుడి చేసిన పనేంటో చూడండి..
వీళ్లకు ఎక్కడా స్థలం లేనట్లుంది.. రన్నింగ్ రైల్లో ఏకంగా డోరు వద్దే నిలబడి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి