Mosquitoe History: మొదటి దోమ ఎప్పుడు పుట్టింది.. వీటి చరిత్ర గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Nov 29 , 2025 | 06:59 PM
ఈ దోమలు ఇప్పటివి కావు. పలు అధ్యయనాలు వెల్లడిస్తు్న్న వివరాల ప్రకారం.. దోమలు డైనోసార్ల కాలం నాటివని తెలుస్తోంది. క్రెటేషియస్ కాలంలో డైనోసార్లు సంచరిచేవని అందరికీ తెలిసిందే. ఇదే కాలంలో..
దోమ.. రెండు అక్షరాల ఈ పేరు వింటే పెద్ద పెద్ద జంతువులు, మనుషులు సైతం భయంతో వణికిపోవాల్సిందే. అసలే ఇది చలికాలం కావడంతో దోమల కారణంగా చాలా మంది జ్వరాలతో సతమతమవుతున్నారు. దోమల కారణంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాధులు వ్యాపిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ దోమ అసలు ఎప్పుడు పుట్టింది, దీని నేపథ్యం ఏంటి, ప్రపంచలో ఎన్ని రకాల దోమలు ఉన్నాయి.. తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
దోమల (Mosquitoes) చరిత్ర చాలా పెద్దగానే ఉంది. అసలు ఈ దోమలు ఇప్పటివి కావు. పలు అధ్యయనాలు వెల్లడిస్తు్న్న వివరాల ప్రకారం.. దోమలు డైనోసార్ల కాలం నాటివని తెలుస్తోంది. క్రెటేషియస్ కాలంలో డైనోసార్లు సంచరిచేవని అందరికీ తెలిసిందే. ఇదే కాలంలో దోమల శిలాజాలు కనుగొనబడ్డాయట. దోమలు ఓ ప్రత్యేకమైన కీటకాల కుటుంబం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. చావోబోరిడే అని పిలువబడే లార్వా.. ఈ దోమలకు అత్యంత దగ్గరి జాతి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మిలియన్ల సంవత్సరాల క్రితం ఎగిరే, నీటిలో నివసించే చిన్న చిన్న కీటకాల నుంచి ఈ దోమలు ఉద్భవించినట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

అప్పటి ఈ కీటకాలు.. కాలక్రమేణా ఇప్పుడు మనం చూస్తున్న దోమలుగా రూపాంతరం చెందాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు చూస్తున్న దోమలు.. గోండ్వానా సూపర్ ఖండం కాలంలో, భూమి పెద్ద ఖండంగా విభజించబడిన సమయంలో ఉండేవట. అనంతరం ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికాగా గోండ్వానా ఏర్పడినప్పుడు, ఈ దోమలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయట. అప్పటి నుంచి దోమలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని వాతావరణానికి అలవాటు పడ్డాయట. అలాగే కాలక్రమేణా ఈ దోమల్లోనూ వేలాది కొత్త జాతులుగా అభివృద్ధి చెందాయి. ప్రస్తుతం ప్రపంచంలో సుమారు 3,500 కంటే ఎక్కువ దోమ జాతులు ఉన్నట్లు తెలుస్తంది. హానిచేయని దోమలతో పాటూ తీవ్ర ప్రభావం చూపించే దోమలు కూడా చాలా ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, జికా, వెస్ట్ నై వైరస్ వంటి ప్రాణాంతక వ్యాధులను వ్యాపింపజేస్తున్న విషయం తెలిసిందే. చూసేందుకు చిన్నగా కనిపిస్తున్న దోమల చరిత్ర ఇంత పెద్దగా ఉందన్నమాట.
ఇవి కూడా చదవండి..
పడేసిన ప్లాస్టిక్ బాటిల్‌ను ఇంతకంటే బాగా ఎవరూ వాడలేరేమో..
వీళ్లకు ఎక్కడా స్థలం లేనట్లుంది.. రన్నింగ్ రైల్లో ఏకంగా డోరు వద్దే నిలబడి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి