Gold Theft Viral Video: బంగారం కొనడానికి వచ్చి.. చివరకు సింపుల్‌గా..
ABN , Publish Date - Nov 29 , 2025 | 03:56 PM
ఓ వ్యక్తి స్టైల్‌గా తయారై.. బంగారం కొనేందుకు దుకాణానికి వెళ్లాడు. దుకాణ యజమాని కొన్ని నగల బాక్స్‌ను అతడి ముందు ఉంచాడు. అందులోని నగలను కొద్ది సేపు పరిశీలించాడు. ఈ క్రమంలో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సులభంగా డబ్బు సంపాదించాలనే క్రమంలో చాలా మంది ఎంతకు తెగించడానికైనా సిద్ధపడుతున్నారు. కొందరు ఎవరికీ అనుమానం రాకుండా చోరీలు చేస్తుంటే.. మరికొందరు ఏకంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఇంకొందరైతే పైకి హుందాగా నటిస్తూ చివరికి నగలు, నగదును ఎత్తుకెళ్లుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బంగారం కొనేందుకు దుకాణానికి వెళ్లాడు. ఈ క్రమంలో సింపుల్‌గా బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బదౌన్ నగరంలోని సదర్ కొత్వాలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి స్టైల్‌గా తయారై.. బంగారం కొనేందుకు దుకాణానికి వెళ్లాడు. దుకాణ యజమాని కొన్ని నగల బాక్స్‌ను అతడి ముందు ఉంచాడు. అందులోని నగలను కొద్ది సేపు పరిశీలించాడు. ఈ క్రమంలో షాపు యజమాని వేరే వారికి నగలు చూపించేందుకు కాస్త దూరంగా జరిగాడు.
ఈ క్రమంలో నగలను పరిశీలిస్తున్న యువకుడు.. మెల్లిగా మూడు చైన్స్‌ను చేతిలోకి (Thief Stole Gold Jewelry) తీసుకుని అక్కడి నుంచి పరుగందుకున్నాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. షాపు యజమానికి.. పట్టుకోండి పట్టుకోండి అని అరుస్తూ తల బాదుకుంటూ ఏడ్చాడు. అక్కడున్న ఓ వ్యక్తి దొంగను పట్టుకునేందుకు వెనుకే పరుగెత్తాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. దొంగిలించబడిన మూడు చైన్స్ విలువ రూ.5 లక్షలకు పైగా ఉంటుందని దుకాణ యజమాని చెబుతున్నాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగ కోసం గాలిస్తున్నారు.
ఈ ఘటన మొత్తం దుకాణంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘బంగారం ధర పెరిగేకొద్దీ.. భద్రత ప్రశ్నార్థకంగా మారింది’.. అంటూ కొందరు, ‘యూపీలో నేరాలు పెరిగిపోతున్నాయి.. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 700కి పైగా లైక్‌లు, 25 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పడేసిన ప్లాస్టిక్ బాటిల్‌ను ఇంతకంటే బాగా ఎవరూ వాడలేరేమో..
వీళ్లకు ఎక్కడా స్థలం లేనట్లుంది.. రన్నింగ్ రైల్లో ఏకంగా డోరు వద్దే నిలబడి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి