Exam Viral Video: ఈ విద్యార్థులను పట్టుకోవడం ఎవరితరమూ కాదేమో.. ఎలా కాపీ కొడుతున్నారో చూడండి..
ABN , Publish Date - Nov 25 , 2025 | 03:21 PM
ఓ పరీక్ష కేంద్రంలో విద్యార్థులంతా పరీక్ష రాస్తున్నారు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా కూడా వారిలో కొందరు విద్యార్థులు చేసిన నిర్వాకం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. పరీక్షకు ప్రిపేర్ కాని వారంతా.. ఎలాగైనా కాపీ కొట్టి పాస్ కావాలని ఫిక్స్ అయ్యారు. అయితే..
విద్యార్థి దశలో ప్రతి ఒక్కరూ పరీక్షల్లో ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విధంగా కాపీ కొట్టే ఉంటారు. కొందరు కాపీలను డైరెక్ట్‌గా జేబులో పెట్టుకుని వెళ్తే.. మరికొందరు ఇంకాస్త తెలివిగా ఆలోచిస్తూ కాపీ స్లిప్పులను దాచుకుంటుంటారు. చివరకు ఇన్విజిలేటర్లకు పట్టుబడుతుంటారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉండడంతో ఇలాంటి చిత్రవిచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులు కాపీ కొట్టిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పరీక్ష కేంద్రంలో విద్యార్థులంతా పరీక్ష రాస్తున్నారు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా కూడా వారిలో కొందరు విద్యార్థులు చేసిన నిర్వాకం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. పరీక్షకు ప్రిపేర్ కాని వారంతా.. ఎలాగైనా కాపీ కొట్టి పాస్ కావాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఇన్విజిలేటర్లకు దొరక్కుండా కాపీ కొట్టేందుకు వివిధ రకాలుగా ఆలోచించారు.
చివరకు వారికి ఓ సూపర్ ఐడియా తట్టింది. కాపీ స్లిప్పులను అన్నింటినీ చిన్నగా ఒకే సైజులో కత్తిరించుకున్నారు. వాటిని చొక్కాకు లోపలి వైపు ఉన్న బ్రాండ్ లేబుల్‌కు (Slips under shirt label) కింద వైపు స్టిప్పులన్నింటినీ పిన్ చేశాడు. తర్వాత తాపీగా నడుస్తూ పరీక్ష కేంద్రంలోకి వచ్చాడు. పరీక్ష మొదలవగానే షర్ట్ లేబుల్ కింద వైపు (Copying in the exam) ఉన్న సిప్పులను బయటికి తీసి చకచకా రాసేశాడు. అతను రాయడమే కాకుండా పక్కన ఉన్న వారికి కూడా స్లిప్పులను అందించాడు.
ఈ ఘటనను మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చూస్తుంటే ఇదంతా వ్యూస్ కోసం చేసినట్లుగా అనిపిస్తున్నా కూడా వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలాక్కూడా కాపీ కొట్టవచ్చని ఇప్పుడే తెలిసింది’.. అంటూ కొందరు, ‘వీళ్ల తెలివితేటలు మామూలుగా లేవుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లు, 60 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఇలా చనిపోతుందని ఎవరైనా అనుకున్నారా.. ఎద్దుల బండి నడుపుతుండగా..
బొద్దింకలతో కాఫీ.. దీని రేటు, ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి