Leopard Viral Video: ఇది కదా స్కెచ్ అంటే.. చిరుత పులి ఎలా వేటాడిందో.. అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - Nov 23 , 2025 | 09:07 AM
ఓ చిరుత పులి రాత్రి వేళ అటవీ సమీప గ్రామంలోకి చొరబడింది. ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో దానికి జంతువుల గుంపు కనిపిస్తుంది. అయితే వెంటనే పరుగు స్టార్ట్ చేయకుండా.. తెలివిగా వ్యవహరిస్తుంది..
చిరుత పులి అంటేనే వేగానికి మారు పేరు. ఎంత పెద్ద జంతువునైనా, ఎంత వేగంగా వెళ్లే జంతువునైనా.. వెంటాడి వెంటాడి మరీ వేటాడుతుంది. ఒక్క సారి పరుగు మొదలెట్టిందంటే.. అవతల ఎలాంటి జంతువు ఉన్నా కూడా దానికి ఆహారమైపోవాల్సిందే. అయితే ఇలాంటి చిరుతకు కూడా కొన్నిసార్లు శ్రమ లేకుండా వేటాడుతుంటుంది. మరికొన్నిసార్లు పొదల మాటున నక్కి నక్కి వేటాడుతుంటుంది. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ చిరుతపులి వేాడే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. సినిమా స్కెచ్‌కు మించిన స్కెచ్ అంటే ఇదే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ చిరుత పులి (Leopard) రాత్రి వేళ అటవీ సమీప గ్రామంలోకి చొరబడింది. ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో దానికి జంతువుల గుంపు కనిపిస్తుంది. అయితే వెంటనే పరుగు స్టార్ట్ చేయకుండా.. తెలివిగా వ్యవహరిస్తుంది.
వాటికి ఎలాంటి అనుమానం రాకుండా నక్కి నక్కి నడుస్తుంది. కాస్త దూరం అలా వెళ్లి.. ఒక్కసారిగా తన కాళ్లకు పని పెడుతుంది. ఒక్క ఉదుటున పరుగులు తీసి వాటిపై పడుతుంది. చిరుత పులిని చూసి భయంతో ఆ జంతువులు అక్కడే ఉన్న నీటిలోకి దూకి పారిపోయేందుకు ప్రయత్నించాయి. అయినా చిరుత వదలకుండా నీటిలోకి (Leopard attack) దూకి మరీ వాటిపై పడుతుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. పరిస్థితి చూస్తుంటే ఈ దాడిలో ఆ జంతువు చిరుతకు ఆహారమైనట్లు తెలుస్తోంది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘చిరుత వేట మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘అడవులను నరికేడం వల్లే పులులు ఇలా గ్రామాల్లోకి వస్తున్నాయి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఇలా చనిపోతుందని ఎవరైనా అనుకున్నారా.. ఎద్దుల బండి నడుపుతుండగా..
బొద్దింకలతో కాఫీ.. దీని రేటు, ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి