Share News

Doctor Viral News: ఆస్పత్రిలోనే మొదలెట్టేశాడు.. కాబోయే భార్యతో ఈ వైద్యుడు ఏం చేశాడంటే..

ABN , Publish Date - Nov 21 , 2025 | 06:56 PM

సిద్దిఖీ అనే వ్యక్తి ఓ ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నాడు. ఇతడికి ఇటీవల పెళ్లి ఫిక్స్ అయింది. ఇంతవరకూ అంతా ఓకే గానీ.. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. కాబోయే భార్యతో కలిసి అతను ఇటీవల చేసిన నిర్వాకం.. చివరకు అతడి ఉద్యోగం పోవడానికి కారణమైంది.. వివరాల్లోకి వెళితే..

Doctor Viral News: ఆస్పత్రిలోనే మొదలెట్టేశాడు.. కాబోయే భార్యతో ఈ వైద్యుడు ఏం చేశాడంటే..

వైద్యులను అంతా దేవుళ్లతో సమానంగా చూస్తుంటారు. చాలా మంది వైద్యులు కూడా ఇందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తూ.. ఎంతో మంది రోగుల ప్రాణాలను కాపాడుతుంటారు. అయితే కొందరు మాత్రం వారి వృత్తికే చెడ్డ పేరు తెస్తుంటారు. ఇంకొందరు విధుల్లో పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతుంటారు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వైద్యుడు ఆస్పత్రి గదిలో తనకు కాబోయే భార్యతో డాన్స్ చేశాడు. చివరకు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) షామ్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వకార్ సిద్దిఖీ అనే వ్యక్తి ఈ ఆస్పత్రి అత్యవసర విభాగంలో వైద్యుడిగా పని చేస్తున్నాడు. ఇతడికి ఇటీవల పెళ్లి ఫిక్స్ అయింది. ఇంతవరకూ అంతా ఓకే గానీ.. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఇటీవల సిద్దిఖీకి కాబోయే భార్య అతను పని చేస్తున్న ఆస్పత్రికి వచ్చింది. ఆమెతో నాలుగు మాటలు మాట్లాడి పంపించాల్సింది పోయి.. ఏకంగా డాన్సే చేయడం స్టార్ట్ చేశాడు.


doctor-dance-viral-video.jpg

అర్ధనగ్నంగా ఉన్న అతను.. ఆసుపత్రి పైఅంతస్తు మూసి ఉన్న గదిలో తనకు కాబోయే భార్యతో డాన్స్ మొదలెట్టాడు. వార్డులోని బెడ్ పక్కనే నేలపై పడుకుని అటూ, ఇటూ దొర్లుతూ డాన్స్ చేశాడు. అతడి స్టెప్పులకు ఆమె కూడా కాలు కదిపింది. ఇద్దరూ కలిసి (Doctor dances with his fiancee in Hospital Room) అక్కడ చాలా సేపు ఇలా డాన్స్ చేయసాగారు. తామేదో ఘనకార్యం చేశామన్నట్లుగా.. ఆ ఘటనను మొత్తం వీడియో తీయించారు. ఈ వీడియో చివరకు నెట్టింట్లోకి వచ్చి చేరింది. బుధవారం ఈ వీడియో వైద్యాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఉన్నతాధికారులు వివరణ కోరారు.


ఈ ఘటనపై సదరు వైద్యుడు ఇచ్చిన వివరణ సరిగా లేకపోవడంతో.. అతన్ని విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ వైద్యుడిని రెండేళ్ల కాంట్రాక్ట్ నిమిత్తం విధుల్లోకి తీసుకున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలాంటి వైద్యుల వల్లే సమస్యలు తలెత్తుతున్నాయి’.. అంటూ కొందరు, ‘ఇంకొసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

రైలు రద్దీగా ఉంటే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా..

వాషింగ్‌మిషిన్ వాడేది దుస్తుల కోసమే అనుకుంటున్నారా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 21 , 2025 | 08:03 PM