Snake Viral Video: అనుకోకుండా పామును తొక్కించాడు.. చివరకు జరిగింది చూస్తే షాక్ అవుతారు..
ABN , Publish Date - Nov 16 , 2025 | 08:10 PM
బైకుపై వచ్చిన ఓ వ్యక్తి.. బండిని పార్క్ చేసే సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పార్కింగ్ స్థలం వద్ద ఉన్న నాగుపామును చూసుకోకుండా తొక్కించాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు కొందరికి పాముల విషయంలో షాకింగ్ అనుభవం ఎదురవుతుంటుంది. మంచాలు, కూలర్లు, ఫ్రిడ్జ్‌ల కింద నుంచి బయటికి వచ్చి ఉలిక్కిపడేలా చేస్తుంటాయి. ఇంకొన్నిసార్లు ఏకంగా మంచాల మీదకే వచ్చేస్తుంటాయి. ఈ క్రమంలోచాలా మంది అనుకోని విధంగా పాము కాటుకు గురవుతుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి అనుకోకుండా బైకుతో పామును తొక్కించాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బైకుపై వచ్చిన ఓ వ్యక్తి.. బండిని పార్క్ చేసే సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పార్కింగ్ స్థలం వద్ద ఉన్న నాగుపామును చూసుకోకుండా తొక్కించాడు. చూసేందుకు పిల్ల పాము అయినా.. తోక తొక్కడంతో బుసలు కొడుతూ పైకి లేచింది. అదే సమయంలో అతను బైకును వెనక్కు జరుపుతుండగా.. పాము అతడి కాలిపై కాటేయడానికి ప్రయత్నించింది.
మొదటి ప్రయత్నంలో విఫలమైనా.. రెండోసారి (Snake Bites Biker) అతడి కాలిపై కాటేసింది. అప్పటిదాకా బండిని పార్క్ చేసే హడావుడిలో ఉన్న అతను.. చివరికి పాము కాటేయడాన్ని చూసి షాక్ అయ్యాడు. బండిని కింద పడేసి పక్కకు పారిపోయాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఈ ఘటనను చూసి చాలా మంది షాక్ అవుతుండగా.. కొందరు మాత్రం ఇది ఏఐ అంటూ కొట్టిపడేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలాంటి సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’.. అంటూ కొందరు, ‘పామును చూసి అతను భయపడ్డాడు.. అతన్ని తొక్కించడంతో భయపడి పాము కాటేసింది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2100కి పైగా లైక్‌లు, 1.4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
రైలు రద్దీగా ఉంటే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా..
వాషింగ్‌మిషిన్ వాడేది దుస్తుల కోసమే అనుకుంటున్నారా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి