Share News

Train Viral Video: రైలు రద్దీగా ఉంటే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా..

ABN , Publish Date - Nov 16 , 2025 | 04:27 PM

ఓ రైల్లో జనం రద్దీగా ఉన్నారు. బోగీలో అటూ, ఇటూ నడవడానికీ ఇబ్బందిగా ఉంది. ఈ సమయంలో ఓ పిల్లాడికి మూత్రం అర్జంట్ అయింది. అయితే పిల్లాడిని బాత్రూం తీసుకెళ్లడానికి తండ్రికి పెద్ద సమస్యగా మారింది. దీంతో చివరికి ఏం చేశాడో మీరే చూడండి..

Train Viral Video: రైలు రద్దీగా ఉంటే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా..

రైలు ప్రయాణ సమయాల్లో చాలా మందికి వివిధ రకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. కొందరికి రైలు ఎక్కి, దిగే సమయంలో షాకింగ్ అనుభవాలు ఎదురైతే.. మరికొందరికి సీట్లు దక్కించుకునే విషయంలో చుక్కలు కనిపిస్తుంటాయి. అలాగే ఇంకొందరికి లగేజీ పెట్టుకోవడం, బాత్రూంకి వెళ్లే సమయంలో సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయాల్లో చాలా మంది వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన కొడుక్కు మూత్రం వస్తోందని వినూత్న ప్రయోగం చేశాడు. ఇతడు చేసిన పని చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) వైరల్ అవుతోంది. ఓ రైల్లో జనం రద్దీగా (Crowded train) ఉన్నారు. బోగీలో అటూ, ఇటూ నడవడానికీ ఇబ్బందిగా ఉంది. ఈ సమయంలో ఓ పిల్లాడికి మూత్రం (urine) అర్జంట్ అయింది. అయితే పిల్లాడిని బాత్రూం తీసుకెళ్లడానికి తండ్రికి పెద్ద సమస్యగా మారింది. దీంతో చివరకు అతడికి ఓ విచిత్రమైన ఐడియా వచ్చింది. పిల్లాడిని కిటికీ బయటికి పెట్టి, బయట ఉన్న పైప్‌లైన్‌పై నిలబెట్టాడు.


పిల్లాడు పైప్‌లైన్ మీద నుంచే మూత్రవిసర్జన చేశాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఈ సమయంలో రైలు ఏమాత్రం ముందుకు, వెనక్కు కదిలినా ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. అయితే ఆ సమయంలో రైలు కదలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. ఇతడు చేసిన నిర్వాకం చూసి.. అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. ఎలాగోలా బాత్రూంలోకి తీసుకెళ్లకుండా.. ఇలా ప్రమాకరంగా కిటికీ బయట నిలబెట్టడం ఏంటీ.. అని మండిపడుతున్నారు.


ఈ ఘటనను కొందరు తమ ఫోన్లలో రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలా చేయడం ప్రమాదకరం’.. అంటూ కొందరు, ‘ఇతడికి కొంచెమైనా బ్రెయిన్ ఉందా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1700కి పైగా లైక్‌లు, 2.13 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ముల్లు తీసేందుకు తంటాలు పడుతున్నారా.. ఈ ట్రిక్ తెలిస్తే అవాక్కవుతారు..

ఈ వరుడు మరీ ఫాస్ట్‌గా ఉన్నాడుగా.. కెమెరామెన్‌కు ఎలా షాకిచ్చాడంటే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 16 , 2025 | 04:27 PM