Monkey Funny Video: కోతికీ టేస్ట్ ఉంటుంది.. పాడైన గుడ్డు ఇవ్వగానే.. ఏం చేసిందంటే..
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:31 PM
ఓ కోతి రాయిపై కూర్చుని పర్యాటకులు ఇచ్చే ఆహారం కోసం ఎదురు చూస్తుంటుంది. ఇంతలో ఓ పర్యాటకుడు అక్కడి వచ్చాడు. పాడైన గుడ్డును కోతికి అందించాడు. గుడ్డును చూసిన కోతి.. వెంటనే దాన్ని తీసుకుంటుంది. గుడ్డుపై బొప్పిని ఎంతో ఓపిగ్గా ఒలిచి తీసేసింది. అయితే తీరా తినబోయే ముందు ఏమవుతుందో మీరే చూడండి..
కోతులంటే అందరికీ గుర్తుకొచ్చేది పిచ్చి చేష్టలే. అయితే ఇలాంటి పిచ్చి పనులు చేసే కోతులు కూడా కొన్నిసార్లు అంతా ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్నిసార్లు అంతా తెగ నవ్వుకునేలా వ్యవహరిస్తుంటాయి. అప్పుడప్పుడూ మనుషులను మక్కీకి మక్కీ కాపీ కొడుతూ అవి చేసే పనులు.. తెగ ఆటక్టుకుంటుంటాయి. ఇలాంటి సరదా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాడైన గుడ్డు వాసన చూసిన కోతి.. చివరకు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కోతి రాయిపై కూర్చుని పర్యాటకులు ఇచ్చే ఆహారం కోసం ఎదురు చూస్తుంటుంది. ఇంతలో ఓ పర్యాటకుడు అక్కడి వచ్చాడు. పాడైన గుడ్డును కోతికి అందించాడు. గుడ్డును చూసిన కోతి.. వెంటనే దాన్ని తీసుకుంటుంది. గుడ్డుపై బొప్పిని ఎంతో ఓపిగ్గా ఒలిచి తీసేసింది. అయితే లోపల పూర్తిగా నల్లగా మారడం చూసి కోతికి అనుమానం కలుగుతుంది.
ఎందుకైనా మంచిదని దాన్ని ముక్కు దగ్గరగా పెట్టుకుని వాసన చూసింది. కంపు కొట్టడంతో ( Rotten egg) వెంటనే దాన్ని పక్కన పడేస్తుంది. అయితే ఆ వాసన భరించలేని కోతికి.. గుడ్డును పక్కన పడేసిన తర్వాత వాంతికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో వాక్.. వాక్.. అనుకుంటూ వాంతికి చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ వాసనతో చాలా సేపు ఇబ్బంది పడుతుంది.
గుడ్డు ఇచ్చిన వ్యక్తి.. కోతి ఎక్స్‌ప్రెషన్స్‌ను (Monkey Expressions) వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘కోతిని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదు’.. అంటూ కొందరు, ‘కోతి ఎక్స్‌ప్రెషన్స్ మామూలుగా లేవుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 94 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ముల్లు తీసేందుకు తంటాలు పడుతున్నారా.. ఈ ట్రిక్ తెలిస్తే అవాక్కవుతారు..
ఈ వరుడు మరీ ఫాస్ట్‌గా ఉన్నాడుగా.. కెమెరామెన్‌కు ఎలా షాకిచ్చాడంటే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి