Home » Monkey
గేదెకు నీళ్లు పెట్టేందుకు వెళ్లిన వృద్ధురాలిపై కోతుల మూక దాడి చేసింది. కోతుల మూక దాడిలో గాయపడ్డ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన కాకినాడలో శనివారం చోటుచేసుకుంది.
జపాన్‌కు చెందిన వైరల్ కోతి పిల్ల పంచ్ మరోసారి వార్తల్లో నిలిచింది. జూ సందర్శకులకు చేయి ఎత్తి హాయ్ చెబుతూ అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయస్థాయిలో అనేక అవార్డులు పొందిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణాన్ని కోతులు, కుక్కలు, పందులు వణికిస్తున్నాయి. పట్టణంలో ఎక్కడచూసినా ఇవే దర్శనమిస్తాయి.
కోతుల బెడదను అరికట్టేందుకు కోహెడ మండలం నకిరేకొమ్ములలో ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
ఒక కోతి చేసిన సాహస విన్యాసానికి సంబంధించిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కోతి చాలా ఎత్తుగా ఉన్న గోడ వద్దకు వచ్చింది. సాధారణంగా ఆ గోడను ఎక్కడం అసాధ్యం. అయితే..
తెలంగాణతో పాటు దేశంలో చాలా రాష్ట్రాల్లో కోతుల సమస్యలపై బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్లమెంట్ లో ప్రస్తావించారు. ఈ సమస్య తమ శాఖ కిందకు రాదని ప్రభుత్వ శాఖలు తప్పించుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. వానరాల సమస్య ఏ శాఖ కిందకు వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.
ఓ కోతి రాయిపై కూర్చుని పర్యాటకులు ఇచ్చే ఆహారం కోసం ఎదురు చూస్తుంటుంది. ఇంతలో ఓ పర్యాటకుడు అక్కడి వచ్చాడు. పాడైన గుడ్డును కోతికి అందించాడు. గుడ్డును చూసిన కోతి.. వెంటనే దాన్ని తీసుకుంటుంది. గుడ్డుపై బొప్పిని ఎంతో ఓపిగ్గా ఒలిచి తీసేసింది. అయితే తీరా తినబోయే ముందు ఏమవుతుందో మీరే చూడండి..
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పంటలను కోతుల బెడద నుంచి కాపాడుకోవడానికి ఓ రైతు వినూత్న ఉపాయాన్ని కనిపెట్టాడు.
ఓ అందమైన ప్రదేశంలో పర్యాటకులు.. ప్రకృతి అందాలను వీక్షిస్తూ నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడే ఓ కోతి ఆహారం కోసం దీనంగా కూర్చుని ఉంది. అంతా ఆ కోతిని చూసి ఎంతో బుద్ధిగా ఉందని అనుకున్నారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ వ్యక్తి పర్యాటక ప్రాంతంలో ఫొటో తీసుకుంటుంటే.. వెనుకే వెళ్లిన కోతి చటుక్కున అతడి కళ్లద్దాలను లాగేసుకుంటుంది. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా ఉలిక్కిపడిపోతాడు. తర్వాత వెనక్కు తిరిగి కోతి నిర్వాకం చూసి అవాక్కవుతాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..