Innovative Winter Jacket: ఈ జాకెట్ ధరిస్తే చలి పరారవ్వాల్సిందే.. ఎలా తయారు చేశారో చూడండి..
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:17 PM
చలిని తట్టుకునేందుకు ఓ వ్యక్తి ధరించిన జాకెట్ అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. సాధారణానికి భిన్నంగా ఈ జాకెట్‌ను రూపొందించారు. నాలుగు జాకెట్లను కలిపి ఓకే జాకెట్‌లా జాయింట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు..
చలికాలం రానే వచ్చింది. రోజురోజుకూ చలి తీవ్రత పెరిగిపోతోంది. దీంతో ఉదయం ఇంటి నుంచి బయటికి రావాలంటేనే జనం ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. మరోవైపు చాలా మంది చలిని తట్టుకునేలా ఉన్ని దుస్తులు, వినూత్నమైన జాకెట్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో వీటికి డిమాండ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. చలిని తట్టుకునేలా ఓ వ్యక్తి వేసుకున్న జాకెట్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. దీన్ని తయారు చేసిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఈ జాకెట్ ధరిస్తే.. చలి చచ్చినట్లే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చలిని తట్టుకునేందుకు ఓ వ్యక్తి ధరించిన జాకెట్ (Winter Jacket) అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. సాధారణానికి భిన్నంగా ఈ జాకెట్‌ను రూపొందించారు. నాలుగు జాకెట్లను కలిపి ఓకే జాకెట్‌లా జాయింట్ చేశారు. ముందుగా ఒక జాకెట్‌ను ధరించిన ఆ వ్యక్తి.. ఆ తర్వాత వరసగా మిగతా జాకెట్లను ధరించాడు.
ఇలా నాలుగు జాకెట్లను (Four jackets) ఒక దానిపై ఒకటి ఒంటిపై సెట్ అయిపోయాయి. ఫైనల్‌గా వాటికి ఉన్న గుండీలను తీసి చూడగా.. అన్నీ కలిసి ఒంటిపై విభిన్నంగా కనిపిస్తున్నాయి. అలాగే చలి తట్టుకునేలా మందంగా మారిపోయాయన్నమాట. ఇలా ఆ వ్యక్తి నాలుగు జాకెట్లను కలిపి ఒకే జాకెట్‌లా ధరించి.. అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివి రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇది జాకెట్‌లా కాదు.. బుల్లెట్ ఫ్రూప్ జాకెట్‌లా ఉందే’.. అంటూ కొందరు, ‘ఇది ఏఐ వీడియోలా ఉందే.. మామూలుగా అయితే ఇలా సాధ్యం కాదు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8100కి పైగా లైక్‌లు, 5.4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ముల్లు తీసేందుకు తంటాలు పడుతున్నారా.. ఈ ట్రిక్ తెలిస్తే అవాక్కవుతారు..
ఈ వరుడు మరీ ఫాస్ట్‌గా ఉన్నాడుగా.. కెమెరామెన్‌కు ఎలా షాకిచ్చాడంటే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి