Share News

Crocodile Attack On Lion: మొసలి తెలివి అంటే ఇదే.. సింహాన్ని ఎలా వేటాడిందో చూస్తే..

ABN , Publish Date - Nov 08 , 2025 | 01:57 PM

దాహం వేయడంతో ఓ సింహం.. నీళ్లు తాగేందుకు ఓ నది వద్దకు వెళ్లింది. నది లోపలికి దిగిన సింహం దాహం తీర్చుకుంటుంది. అయితే అప్పటికే ఓ మొసలి నీటిలో నక్కి, వేట కోసం ఎదురుచూస్తోంది. దాహం తీర్చుకున్న సింహం.. నది దాటేందుకు ప్రయత్నించింది. చివరకు ఏమైందో మీరే చూడండి..

Crocodile Attack On Lion: మొసలి తెలివి అంటే ఇదే.. సింహాన్ని ఎలా వేటాడిందో చూస్తే..

మొసలి పవర్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అవి ఒక్కసారి టార్గె్ట్ చేశాయంటే.. ఇక వాటి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. మొసళ్లు కొన్నిసార్లు వేటాడే విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మరికొన్నిసార్లు అవి ఎంతో తెలివిగా వేటాడుతుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సింహాన్ని ఓ మొసలి వేటాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దాహం వేయడంతో ఓ సింహం.. నీళ్లు తాగేందుకు ఓ నది వద్దకు వెళ్లింది. నది లోపలికి దిగిన సింహం దాహం తీర్చుకుంటుంది. అయితే అప్పటికే ఓ మొసలి నీటిలో నక్కి, వేట కోసం ఎదురుచూస్తోంది. దాహం తీర్చుకున్న సింహం.. నదిని ఒక వైపు నుంచి మరో వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది.


సింహం అక్కడి నుంచి వెళ్లగానే.. మొసలి నదిని (Lion crossing the river) దాటేందుకు ప్రయత్నించగానే.. మొసలి నీటిపైకి వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. సింహం వెనుకే వెళ్లి.. సమీపానికి వెళ్లగానే ఒక్క (Crocodile attack on lion)( ఉదుటున దాడి చేస్తుంది. దెబ్బకు సింహం తప్పించుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోతుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. పరిస్థితి చూస్తుంటే.. ఈ ఘటనలో సింహం ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘మొసలి వేట మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘సింహాన్ని చూస్తుంటే జాలేస్తోంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.36 లక్షలకు పైగా లైక్‌లు, 10 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ముల్లు తీసేందుకు తంటాలు పడుతున్నారా.. ఈ ట్రిక్ తెలిస్తే అవాక్కవుతారు..

ఈ వరుడు మరీ ఫాస్ట్‌గా ఉన్నాడుగా.. కెమెరామెన్‌కు ఎలా షాకిచ్చాడంటే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 08 , 2025 | 01:57 PM