Home » Snake
వియత్నాంలోని డా నాంగ్ నగరానికి సమీపంలో ఉన్న డై లోక్ ప్రాంతంలో ఒక 79 ఏళ్ల వృద్ధుడిని విషపూరితమైన పాము కాటేసింది. అయినా, ఆ వ్యక్తి ఏమాత్రం భయపడకుండా ఆ పామును పట్టుకొని నడుచుకుంటూ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తిరుమలలో అరుదైన పచ్చ నాగుపాము కనిపించింది. సాధారణంగా నాగుపాములు బూడిద రంగులో ఉంటాయి. అయితే తిరుమలలో మాత్రం బుధవారం సాయంత్రం పచ్చ రంగులో ఉన్న నాగుపాము ప్రత్యక్షమై అందరినీ అశ్చర్యపరిచింది.
ఎండలు పెరిగాయి కదా.. చల్లదనం కోసం చేరిందనుకునేరు. కానేకాదు. ప్రాణభయంతో కూలర్లో దాక్కుంది. విషపురుగు కావడంతో స్థానికులు బయటకు లాగి చంపేశారు.
పాము అంటే ఎవరికైనా భయమే. ఎంతో దూరంలో పాము ఉందని తెలిసినా భయాందోళనలకు గురవుతుంటాం. అయితే ఇక్కడే పాముల గురించి ప్రజలకు చాలా విషయాలు తెలియందంటున్నారు స్నేక్ క్యాచర్లు. అవి కాటేసే ముందు హెచ్చరిస్తాయట.
చైనాలోని బీజింగ్‌కు చెందిన ఓ వ్యక్తి పెంపుడు పాము కాటు వేయటం వల్ల తన బొటన వేలిని కోల్పోయాడు. ఆరోగ్యం బాగోలేని పాముకు గోరు ముద్దలు తినిపించటంతో అతడికి ఈ పరిస్థితి వచ్చింది.
ఇళ్ల సమీపంలోకి పాము రావడంతో అంతా భయపడ్డారు. దాన్ని బయటికి పంపించేందకు పాములు పట్టుకునే వ్యక్తిని పిలిపించారు. సంకలో సంచి, చేతిలో బూరతో అక్కడికి వచ్చిన అతను.. పామును పట్టుకునేందుకు రంగంలోకి దిగాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ ఇంట్లోకి పాము రావడంతో అంతా భయపడి పారిపోయారు. స్థానికులు చివరికి స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న మహిళ.. పామును పట్టుకునేందుకు ప్రయత్నించింది. చివరకు ఏమైందో చూడండి..
ఓ పెద్దాయన చేతిలో సంచితో రోడ్డు పక్కన ఇళ్ల ముందు ఆగాడు. అంతా అతన్ని కొత్తగా చూస్తూ ఉన్నారు. ఇంతలో ఆ వ్యక్తి సంచిలో నుంచి ఓ పామును బయటికి తీశాడు. పామును ఆడించి డబ్బులు అడుగుతాడేమో అని అంతా అనుకున్నారు. కానీ..
బైకుపై వచ్చిన ఓ వ్యక్తి.. బండిని పార్క్ చేసే సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పార్కింగ్ స్థలం వద్ద ఉన్న నాగుపామును చూసుకోకుండా తొక్కించాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ట్ఫాల్ గ్రామం... మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఉన్న మారుమూల గ్రామం అది. మనం కుక్కలు, పిల్లులు, కోళ్లు, పశువులను ప్రేమతో పెంచుకున్నట్టు... అక్కడివారు సర్పాలను పెంచుకుంటారు. వాటిని స్వేచ్ఛగా తమ ఇళ్లలోకి ఆహ్వానిస్తారు.