Woman Viral Video: ఇలాంటి వారిని ఏమనాలి.. ఎలా డాన్స్ చేస్తుందో మీరే చూడండి..
ABN , Publish Date - Nov 21 , 2025 | 05:27 PM
ఓ మహిళ కెమెరా ఆన్ చేసుకుని డాన్స్ చేసింది. ఇందులో ఆగ్రహించడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. ఆమె ఒక్కటే డాన్స్ చేసి ఉంటే ఎలాంటి సమస్య ఉండేది కాదు. వినూత్నంగా చేయాలనే ఉద్దేశంతో.. ఏకంగా..
రీల్స్ చేయడమంటే కొందరికి సరదా.. మరికొందరికి అలవాటు. అయితే ఇంకొందరికి మాత్రం రీల్స్ అంటే ఓ వ్యసనం. ఒక్క రోజు కాదు కదా.. ఒక్క గంట కూడా రీల్స్ చేయకుండా ఉండలేని విధంగా వాటికి అడిక్ట్ అయిపోతుంటారు. రీల్స్ చేయడం వరకూ ఓకే గానీ.. ఎలాగైనా నెటిజన్లను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో కొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. మరికొందరు ప్రమాదకర స్టంట్స్ చేయడం కూడా చూస్తున్నాం. కొందరైతే వారు స్టంట్స్ చేయడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ డాన్స్ చేసే క్రమంలో చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో ( Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ కెమెరా ఆన్ చేసుకుని డాన్స్ (Woman dance) చేసింది. ఇందులో ఆగ్రహించడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. ఆమె ఒక్కటే డాన్స్ చేసి ఉంటే ఎలాంటి సమస్య ఉండేది కాదు. వినూత్నంగా చేయాలనే ఉద్దేశంతో.. ఏకంగా ఓ పిల్లాడిని తలపై పడుకోబెట్టుకుని డాన్స్ చేసింది.
పిల్లాడిని తలపై వెల్లకిలా (Woman dances with baby on her head) పడుకోబెట్టింది. చిన్నారి కాళ్లు ఓ వైపు కిందకు వేలాడుతున్నాయి. ఏమాత్రం అటూ, ఇటూ అయినా పిల్లాడు కిందపడిపోయే ప్రమాదం ఉంది. అయినా ఆమె ఇదేమీ ఆలోచించకుండా.. డాన్స్ చేస్తూనే ఉంది. ఇలా చేయడం చాలా ప్రమాదకరం అని తెలిసినా ఆమె డాన్స్ చేయడం.. అందరికీ కోపం తెప్పిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘మీ లైక్‌ల కోసం పిల్లలను బలిచేయకండి ప్లీజ్’.. అంటూ కొందరు, ‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ప్రస్తుతం 8వేల మందికి పైగా లైక్ చేయగా.. 8 లక్షలకు పైగా వీక్షించారు.
ఇవి కూడా చదవండి..
రైలు రద్దీగా ఉంటే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా..
వాషింగ్‌మిషిన్ వాడేది దుస్తుల కోసమే అనుకుంటున్నారా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి