Stunts Viral Videos: ప్రేమికుల షాకింగ్ స్టంట్స్.. కారుపై కూర్చున్న ప్రియుడు.. ప్రియురాలికి ముద్దు పెడుతూ..
ABN , Publish Date - Nov 19 , 2025 | 08:19 PM
వాహనాల రాకపోకలతో రోడ్డు రద్దీగా ఉంది. ఇంతలో ఓ కారులో వెళ్తున్న ప్రేమ జంట అంతా అవాక్కయ్యేలా చేసింది. కారులో వెళ్తున్న వారు వెళ్లకుండా.. ఉన్నట్టుండి సర్కస్ స్టంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా..
ప్రస్తుతం చాలా మంది యువకులు.. ఏదో విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. కొందరు రీల్స్ పేరుతో చిత్రవిచిత్ర ప్రయోగాలు చేయడం, మరికొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ చూసేవారికి చిరాకు తెప్పిస్తుంటారు. ఇంకొందరు అసభ్యకర పనులు చేస్తూ అందరికీ కోపం తెప్పిస్తుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు కారుపై కూర్చుని.. తన ప్రియురాలితో కలిసి అసభ్యర పనులు చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఢిల్లీలోని (Delhi) సాకేత్ జే బ్లాక్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనాల రాకపోకలతో రోడ్డు రద్దీగా ఉంది. ఇంతలో ఓ కారులో వెళ్తున్న ప్రేమ జంట అంతా అవాక్కయ్యేలా చేసింది. కారులో వెళ్తున్న వారు వెళ్లకుండా.. ఉన్నట్టుండి సర్కస్ స్టంట్స్ (Lovers stunt on car) చేశారు. అంతటితో ఆగకుండా ముద్దులు కూడా పెట్టుకున్నారు. కారులో కూర్చున్న ప్రియుడు.. సడన్‌గా కారులో నుంచి బయటికి వచ్చి పైకి ఎక్కాడు. కాసేపటి తర్వాత కారులో ఉన్న అతడి ప్రియురాలు కూడా తల బయటికి పెట్టింది.
కారుపై కూర్చున్న అతను కాసేపటి తర్వాత.. తన ప్రియురాలికి (Boyfriend kissing girlfriend) లిప్ టూ లిప్ కిస్ కూడా ఇచ్చాడు. దీంతో అప్పటిదాకా వారినే గమనిస్తున్న వారంతా.. ఒక్కసారిగా అవాక్కయ్యారు. కొందరు నవ్వుకుంటూ సిగ్గుతో తల పక్కకు తిప్పుకొన్నారు. ఇలా ఆ ప్రేమికులిద్దరూ అంతా చూస్తున్నా కూడా పట్టించుకోకుండా.. ముద్దులు పెట్టుకుంటూ అసభ్యకరంగా ప్రవర్తించారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్తా వైరల్ అవడంతో ప్రజలు ఈ ఘటనపై మండిపడ్డారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
చివరకు ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. కారు యజమానికి జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ప్రేమికుల యాక్షన్‌కు.. పోలీసుల రియాక్షన్ బాగుంది’.. అంటూ కొందరు, ‘ఇలాంటి పనులు ఇంకెవరూ చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రైలు రద్దీగా ఉంటే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా..
వాషింగ్‌మిషిన్ వాడేది దుస్తుల కోసమే అనుకుంటున్నారా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి