Washing Machine Jugaad Video: వాషింగ్‌మిషిన్ వాడేది దుస్తుల కోసమే అనుకుంటున్నారా.. ఈమె ట్రిక్ చూస్తే నోరెళ్లబెడతారు..
ABN , Publish Date - Nov 16 , 2025 | 07:05 PM
ఓ మహిళ వాషింగ్ మిషిన్‌ను విచిత్రంగా వాడి అంతా అవాక్కయ్యేలా చేసింది. వాషింగ్ మిషిన్‌ను ఎవరైనా మాసిన దుస్తులను ఉతికేందుకు వాడతారు. అయితే ఈమె మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..
వస్తువులను అంతా ఒకలా వాడితే.. కొందరు మాత్రం చిత్రవిచిత్రంగా వాడుతుంటారు. స్టవ్‌ను అంతా వంట చేసుకోవడానికి వాడితే కొందరు.. బాత్రూం షవర్‌గా మార్చేస్తారు. అలాగే కుక్కర్‌ను అంతా వంట చేసేందుకు వాడితే.. కొందరు మాత్రం దాంతో బట్టలను ఇస్త్రీ చేస్తుంటారు. అదేవిధంగా వాషింగ్ మిషిన్‌లో వంటపాత్రలను శుభ్రం చేసే వారిని కూడా చూశాం. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ.. వాషింగ్ మిషిన్‌ను వాడిన విధానం చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ వాషింగ్ మిషిన్‌ను విచిత్రంగా వాడి అంతా అవాక్కయ్యేలా చేసింది. వాషింగ్ మిషిన్‌ను ఎవరైనా మాసిన దుస్తులను ఉతికేందుకు వాడతారు. అయితే ఈమె మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. దుస్తులను ఆరబెట్టేందుకు వాడే డ్రైయర్‌ను (Washing machine dryer) వినూత్నంగా వాడింది.
వాషింగ్ మిషిన్ డ్రైయర్‌లో దుస్తులే ఆరబెట్టాలా.. గింజలు ఎందుకు ఆరబెట్టకూడదు.. అనే ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఆచరణలో పెట్టేసింది. నానబెట్టిన గోధుమలను ఆరబెట్టేందుకు ప్రయత్నించింది. ఇందుకోసం తడిసిన గోధుమలను ఓ బట్టలో చుట్టి.. వాషింగ్ మిషిన్ డ్రైయర్‌లో పెట్టింది. దానిపై ప్లాస్టిక్ మూత పెట్టి.. మిషిన్‌ను ఆన్ చేసింది. కొద్ది సేపటి తర్వాత చూడగా.. (woman drying wheat in washing machine dryer) దుస్తులు ఆరినట్లే.. గోధుమలు కూడా పూర్తిగా ఆరిపోయాయి.
ఆరిన గోధుమలను కెమెరాకు చూపిస్తూ.. తన ప్రయోగం ఫలించిందంటూ.. ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వాషింగ్ మిషిన్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’.. అంటూ కొందరు, ‘ఈమె ఐడియా మామూలుగా లేదుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 76 వేలకు పైగా వ్యూస్, 6.6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
రైలు రద్దీగా ఉంటే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా..
ఈ వరుడు మరీ ఫాస్ట్‌గా ఉన్నాడుగా.. కెమెరామెన్‌కు ఎలా షాకిచ్చాడంటే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి