Share News

Desi Jugaad Viral Video: పనికిరానిదంటూ ఏదీ లేదు.. ఈమె ప్రయోగం చూస్తే వావ్ అనాల్సిందే..

ABN , Publish Date - Nov 19 , 2025 | 05:57 PM

ఓ మహిళ పక్కన పడేసిన టాబ్లెట్స్‌‌తో అంతా ఆశ్చర్యపోయే ప్రయోగం చేసింది. దేనికీ పనికి రావనుకున్న టాబ్లెట్స్ అందమైన హారంలా మార్చేసింది. ఇందుకోసం టాబ్లెట్స్‌ను ముందుగా.. ఒక్కొక్కటిగా కత్తిరించేసి పక్కకు తీసింది. చివరకు వాటిని ఎలా మార్చిందో చూడండి..

Desi Jugaad Viral Video: పనికిరానిదంటూ ఏదీ లేదు.. ఈమె ప్రయోగం చూస్తే వావ్ అనాల్సిందే..

కొందరి కళ్లకు చెత్తలో కూడా బంగారం కనిపిస్తుంది. దేనికీ పనికిరావు అనుకున్నవి.. అలాంటివారి చేతిలోకి వెళ్లి.. అద్భుతంగా మారిపోతుంటాయి. ఇటీవల చాలా మంది ఇలా పక్కన పడేసిన వస్తువులతో వినూత్న ప్రయోగాలు చేయడం చూస్తున్నాం. ఓ మహిళ వంట చేసుకునే గరిటను ఫోన్ స్టాండ్‌లా వాడితే.. మరొకరు దోమతెరను ఆరబెట్టిన ధాన్యంపై పెట్టి అందరినీ అవాక్కయ్యేలా చేయడం చూశాం. ఇలాంటి వినూత్న ప్రయోగాలు అందరినీ తెగ ఆకట్టుకున్నాయి. తాజాగా, ఓ మహిళ పక్కన పడేసిన టాబ్లె్ట్స్‌తో విచిత్ర ప్రయోగం చేసింది. వాటితో ఏకంగా నిగనిగలాడే నగ తయారు చేసింది. ఈ వీడియో చూసిన వారంతా.. వావ్.. ఈమె ట్రిక్ మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ పక్కన పడేసిన టాబ్లెట్స్‌‌తో (Useless Medicines) అంతా ఆశ్చర్యపోయే ప్రయోగం చేసింది. దేనికీ పనికి రావనుకున్న టాబ్లెట్స్ అందమైన హారంలా మార్చేసింది. ఇందుకోసం టాబ్లెట్స్‌ను ముందుగా.. ఒక్కొక్కటిగా కత్తిరించేసి పక్కకు తీసింది. తర్వాత ఉబ్బెత్తుగా ఉన్న దానిపై ఎరుపు రంగు పూసింది. ఇలా పక్కకు తీసుకున్న టాబ్లెట్స్ అన్నింటిపై రంగు పూసేసింది.


ఆ తర్వాత టాబ్లెట్ చుట్టూ లేస్‌ను అతికించేసింది. ఇలా అన్నింటికీ లేస్ అతికించిన తర్వాత.. ఒకదాని తర్వాత మరొకటిగా అన్నింటినీ హారంలా కూర్చేసింది. ఫైనల్‌‌గా చూస్తే పాత టాబ్లెట్స్ అన్నీ (Beautiful necklace) అందమైన హారంలా మారిపోయాయి. ఈ టాబ్లెట్స్ హారాన్ని ఆమె మెడలో ధరించగానే.. మరింత అందంగా కనిపించింది. చూస్తే అది నిజమైన హారంలా ఉందే తప్ప.. అవి టాబ్లెట్స్ అనే సందేహం కూడా రాదు.


ఇలా పక్కన పడేసిన టాబ్లెట్స్‌తో ఆమె విచిత్రమైన, వినూత్నమైన ప్రయోగం చేసిందన్నమాట. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘మొత్తం వైద్య సమాజంలోనే ఇదొక భయానక వాతావరణం’.. అంటూ కొందరు, ‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2.6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

రైలు రద్దీగా ఉంటే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా..

వాషింగ్‌మిషిన్ వాడేది దుస్తుల కోసమే అనుకుంటున్నారా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 19 , 2025 | 05:57 PM