Funny Viral Video: అతి తెలివి అంటే ఇదే.. బైక్ చలాన్ తప్పించుకోవడానికి.. ఈ కుర్రాళ్లు చేసిన నిర్వాకం చూస్తే..
ABN , Publish Date - Nov 21 , 2025 | 04:11 PM
రద్దీగా ఉన్న రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. ట్రిబుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారు, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారు.. ఇలా నిబంధనలను అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో జరిగిన ఓ సంఘటన అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది..
బైక్ రైడింగ్ సమయంలో చాలా మంది యువకులు నిబంధనలను ఉల్లంఘించడం సర్వసాధారణమై పోయింది. ఇక ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వారు చేసే నిర్వాకాలు అన్నీ ఇన్నీ కావు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి చిత్రవిచిత్రమైన స్టంట్స్ అన్నీ చేసేస్తుంటారు. కొందరు సిగ్నల్ జంపింగ్ చేస్తే.. మరికొందరు తమ వాహన నంబర్ కెమెరాకు కనిపించకుండా.. విచిత్రంగా రాయిస్తుంటారు. ఇంకొందరు నంబర్ ప్లేట్ కనిపించకుండా అతి తెలివిగా ఆలోచిస్తుంటారు. ఇలాంటి విచిత్రమైన ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రద్దీగా ఉన్న రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) వాహనాల తనిఖీ చేస్తున్నారు. ట్రిబుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారు, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారు.. ఇలా నిబంధనలను అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా.. ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది.
ఆ సమయంలో బైకుపై ఇద్దరు యువకులు అటుగా వచ్చారు. వారికి హెల్మెట్ లేదు. పోలీసులు వాహనాలను తనిఖీ చేయడం చూసిన వారు.. వెంటనే అలెర్ట్ అయ్యారు. బైకును వెంటనే మళ్లించి వెనక్కు తిప్పేశారు. అయితే ఈ సమయంలో బైకుపై వెనుక కూర్చున్న వ్యక్తి ఎంతో తెలివిగా ఆలోచించాడు. పోలీసులు ఎక్కడ ఫొటో తీస్తారో అనే భయంతో.. తన కాలిని (Bike Number Plate) నంబర్ ప్లేట్‌కు అడ్డంగా పెట్టేశాడు.
వారి వాహనాన్ని ఫొటో తీస్తున్న ట్రాఫిక్ పోలీస్.. అతడి అతి తెలివి చూసి అవాక్కయ్యాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వీళ్ల తెలివి మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘భారతదేశంలో ఇలాంటి టాలెంట్‌కు కొదవే లేదు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 వేలకు పైగా లైక్‌లు, 1.9 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
రైలు రద్దీగా ఉంటే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా..
వాషింగ్‌మిషిన్ వాడేది దుస్తుల కోసమే అనుకుంటున్నారా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి