Woman Death Viral Video: ఇలా చనిపోతుందని ఎవరైనా అనుకున్నారా.. ఎద్దుల బండి నడుపుతుండగా..
ABN , Publish Date - Nov 22 , 2025 | 03:10 PM
కమలేష్ అనే 55 ఏళ్ల మహిళ.. పొలం పనులు ముగించుకుని ఎద్దుల బండిపై గ్రామంలోకి చేరుకుంది. కాసేపు ఉంటే ఇంటికి చేరుకుంటుందనగా.. విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు.. అయ్యో పాపం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
పుట్టిన ప్రతి ఒక్కరూ గిట్టక తప్పదు. అయితే చావు అనేది ఒక్కొక్కరి విషయంలో ఒక్కో విధంగా ఉంటుంది. కొందరు అప్పటిదాకా సంతోషంగా ఉండి.. సడన్‌గా మృత్యు ఒడిలోకి జారుకుంటుంటారు. మరికొందరు మంచాన పడి నరకం అనుభవించి ప్రాణాలు వదులుతుంటారు. అయితే ఇంకొందరి విషయంలో మాత్రం.. చావు ఎంతో విచిత్రంగా వస్తుంటుంది. సినిమా ట్విస్ట్‌ల తరహాలో కొందరి విషయంలో నిజ జీవితంలోనూ జరుగుతుంటుంది. ప్రస్తుతం అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు, అన్ని ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలు ఉండడంతో ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ చనిపోయిన విధానం చూసి అంతా.. అయ్యో పాపం.. అంటూ కామెంట్లు చేస్తు్న్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మీరట్ జిల్లా రోహ్తా పోలీస్ స్టేషన్ పరిధిలోని కినౌని గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కమలేష్ (55) అనే మహిళ.. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఇటీవల ఆమె రోజు వారీ పనుల్లో భాగంగా పొలం నుంచి ఎద్దుల బండితో ఇంటికి బయలుదేరింది.
గ్రామంలోకి రాగానే నడుచుకుంటూ బండిని (Bullock cart) తీసుకెళ్తోంది. అయితే ఈ క్రమంలో అకస్మాత్తుగా ఎద్దు వేగంగా ముందుకు కదిలింది. వెళ్తూ వెళ్తూ పక్కనే ఉన్న గోడను ఢీకొట్టింది. దీంతో ఎద్దు పక్కనే నడుస్తున్న మహిళ.. బండికి, గోడకు మధ్యలో ఇరుక్కుపోయింది. బండి బలంగా ఢీకొనడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే (Woman Dies) అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అయ్యో.. ఎంత ఘోరం జరిగింది’.. అంటూ కొందరు, ‘విధి ఎంతో విచిత్రమైంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రైలు రద్దీగా ఉంటే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా..
వాషింగ్‌మిషిన్ వాడేది దుస్తుల కోసమే అనుకుంటున్నారా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి