Share News

Woman In Train: రైలు బోగీలో ఇదేం పని.. మహిళ నిర్వాకం చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ABN , Publish Date - Nov 21 , 2025 | 08:21 PM

రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ అంతా అవాక్కయ్యేలా చేసింది. సీట్ల కోసం కుస్తీ పట్టలేదు గానీ.. సీట్లో కూర్చుని ఆమె చేసిన పనే.. వీడియో వైరల్ అవడానికి కారణమైంది. ఇంతకీ ఆమె ఏం చేసిందో మీరే చూడండి..

Woman In Train: రైలు బోగీలో ఇదేం పని.. మహిళ నిర్వాకం చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

రైలు బోగీల్లో వింత వింత, చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు సీట్ల కోసం ప్రయాణికులు కుస్తీ పడితే.. మరికొందరు ఎవరి సీట్లను వారే క్రియేట్ చేసుకుంటారు. ఇంకొన్నిసార్లేమో.. ఏకంగా చీరలు, దుప్పట్లతో ఊయల తయారు చేస్తుంటారు. ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మహిళ రైల్లో చేసిన వింత నిర్వాకం వీడియో తెగ వైరల్ అవుతోంది. బోగీలో ఆమె చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ (Woman In Train) .. అంతా అవాక్కయ్యేలా చేసింది. సీట్ల కోసం కుస్తీ పట్టలేదు గానీ.. సీట్లో కూర్చుని ఆమె చేసిన పనే.. వీడియో వైరల్ అవడానికి కారణమైంది. సీట్లో కాసేపు కామ్‌గా కూర్చున్న ఆమె.. భోజనం టైం అవగానే తన బ్యాగులోని ఎలక్ట్రిక్ కెటిల్‌ను బయటికి తీసింది. దాని ప్లగ్‌లో ఫోన్ చార్జింగ్ (phone charging socket) సాకెట్‌కు కనెక్ట్ చేసింది.


కెటిల్ హీట్ అవగానే అందులో (Woman makes Maggi in an electric kettle) మ్యాగీ చేసేసింది. మ్యాగీ రెడీ అవగానే తన కుటుంబ సభ్యులందరికీ వడ్డించేసింది. అంతటితో ఆగకుండా దీన్నంతా ఫుడ్ వ్లాగ్ తరహాలో మొత్తం వీడియో రికార్డ్ చేయించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘చార్జింగ్ సాకెట్‌ను ఇంతకంటే ఎవరూ బాగా వాడలేరేమో’.. అంటూ కొందరు, ‘ఇలా చేయడం ప్రమాదం.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2300కి పైగా లైక్‌లు, 8 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

రైలు రద్దీగా ఉంటే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా..

వాషింగ్‌మిషిన్ వాడేది దుస్తుల కోసమే అనుకుంటున్నారా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 21 , 2025 | 09:15 PM