Thieves Dance Funny Video: దొరికిన దొంగలతో డాన్స్.. టీ, బిస్కట్లు ఇస్తూ నాన్‌స్టాప్‌గా..
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:10 PM
ఇటీవల ఇద్దరు దొంగలు ఓ గ్రామంలో చోరీకి పాల్పడ్డారు. అయితే అనుకోకుండా ఆ ఇద్దరూ గ్రామస్తులకు పట్టుబడ్డారు. సాధారణంగా దొంగ దొరకగానే చితకబాదుతుంటారు. అయితే ఈ గ్రామస్తులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. వారిద్దరికీ వింత శిక్ష వేశారు..
దొంగలు దొరికిన సందర్భాల్లో చాలా మంది.. గుంపులో గోవిందా అన్నట్లుగా ఎవరికి తోచినట్లుగా వారు పిడిగుద్దులు కురిపిస్తారు. అలాగే మరికొన్నిచోట్ల దొంగలను చెట్టుకు కట్టేసి కొడుతుంటారు. ఈ క్రమంలో చివరకు పోలీసులు ఎంట్రీ ఇవ్వడం, వారిని స్టేషన్‌కు తీసుకెళ్లడం ఇదంతా కామన్. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ గ్రామంలోకి చొరబడ్డ దొంగలు.. చివరకు ఆ ఊరి వారికి పట్టుబడ్డారు. దీంతో చివరకు వారు దొంగలకు ఎలాంటి శిక్ష వేశారో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అస్సాం (Assam) శివసాగర్ జిల్లాలోని ధయాలి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఇద్దరు దొంగలు ఆ ఊర్లో చోరీకి పాల్పడ్డారు. అయితే అనుకోకుండా ఆ ఇద్దరూ గ్రామస్తులకు పట్టుబడ్డారు. దొరికిన వెంటనే వారిని చితకబాదాల్సిన ప్రజలు.. అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. వారిద్దరికీ వింత శిక్ష వేశారు. పెద్ద స్పీకర్లు ఏర్పాటు చేసి, బీట్ సాంగ్ స్టార్ట్ చేశారు. ఆ మ్యూజిక్‌కు వారిని డాన్స్ చేయమని ఫోర్స్ చేశారు.
డాన్స్ అంటే ఐదు, పది నిముషాలు అనుకుంటే పొరపాటే.. నాన్‌స్టాప్‌గా రెండు, మూడు గంటల పాటు (thieves dance) చేయించారు. అయితే మధ్య మధ్యలో వారికి టీ, బిస్కట్లు కూడా అందించారు. అలాగే అప్పుడప్పుడూ వారికి దెబ్బలు రుచి చూపిస్తూ.. డాన్స్ చేయించారు. వారిలో ఓ వ్యక్తి డాన్స్ రాకున్నా కూడా వారంతా ఎక్కడ తనని చితకబాదుతారో అనే భయంతో వణుకుతూ ఎలాగోలా డాన్స్ చేసేశాడు.
ఈ ఘటనను మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘దొంగలకు అతిథి మర్యాదలు చాలా బాగున్నాయి’.. అంటూ కొందరు, ‘మాకూ ఇలాంటి ట్రీట్‌మెంట్ కావాలి’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6,400కి పైగా లైక్‌లు, 2.77 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఇలా చనిపోతుందని ఎవరైనా అనుకున్నారా.. ఎద్దుల బండి నడుపుతుండగా..
బొద్దింకలతో కాఫీ.. దీని రేటు, ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి