Leopard Attacks Boy: విద్యార్థిపై చిరుత ఎటాక్.. బాలుడు స్కూల్ బ్యాగుతో ఉండడంతో.. చివరకు..
ABN , Publish Date - Nov 22 , 2025 | 06:17 PM
11 ఏళ్ల విద్యార్థి.. తన స్నేహితుడితో కలిసి స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నాడు. ఈ సమయంలో మార్గ మధ్యలో చిరుత సడన్‌గా కువారాపై దాడి చేసింది. ఈ ఘటనలో అతను ధైర్యంగా చిరుతపై ఎదురుదాడి చేశాడు. వివరాల్లోకి వెళితే..
వణ్యమృగాలు జనారణ్యంలోకి రావడం, దాడి చేయడం, ప్రాణాలు తీయడం రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. అలాగే కొన్నిసార్లు క్రూరమృగాలు కూడా భయంతో పారిపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంటుంది. ఇంకొన్నిసార్లు వాటిపై మనుషులు ఎదురుదాడి చేసి తరిమికొట్టే సంఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 11 ఏళ్ల బాలుడిపై ఓ చిరుత దాడి చేసింది. అయితే ఆ సమయంలో బాలుడు.. స్కూల్ బ్యాగుతో ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని (Maharashtra) పాల్ఘర్ జిల్లా పరిధి కాంచడ్ ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కువారా అనే 11 ఏళ్ల బాలుడు.. తన స్నేహితుడితో కలిసి స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నాడు. ఈ సమయంలో మార్గ మధ్యలో చిరుత సడన్‌గా (Leopard attacks student) కువారాపై దాడి చేసింది.
అయితే చిరుత పంజా బాలుడి బ్యాగుపై పడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. చిరుత దాడితో ఆ విద్యార్థి వెంటనే అలెర్ట్ అయ్యాడు. తన స్నేహితుడితో కలిసి.. గట్టిగా కేకలు వేస్తూ చిరుతపై రాళ్లు విసిరాడు. వారి కేకలు విన్న గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. అంతా కలిసి కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో చిరుత సమీపంలోని అడవిలోకి పారిపోయింది. ఈ ఘటనలో బాలుడు స్వల్ప గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
సమాచారం అందుకున్న అటవీ శాఖాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చిరుతను పట్టుకోవడానికి బోన్లు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. అయితే సదరు విద్యార్థి స్కూల్ బ్యాగుతో ఉండడంతో స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలిసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు విద్యార్థిని అభినందిస్తు్న్నారు.
ఇవి కూడా చదవండి..
ఇలా చనిపోతుందని ఎవరైనా అనుకున్నారా.. ఎద్దుల బండి నడుపుతుండగా..
బొద్దింకలతో కాఫీ.. దీని రేటు, ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి