Death Live Video: ప్రాణం ఎప్పుడు, ఎలా పోతుందో ఎవరూ చెప్పలేరు.. ఈ వీడియో చూస్తే అయ్యో పాపం అంటారు..
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:12 PM
చావు ఎప్పుడు, ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటిదాకా సంతోషంగా ఉన్న వారు సడన్‌గా చనిపోతుంటారు. అలాగే కొందరు ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ బాస్కెట్ బాల్ ప్లేయర్.. చనిపోయిన విధానం చూసి అంతా అయ్యో పాపం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
పుట్టిన ప్రతి ఒక్కరూ గిట్టక తప్పదు. అయితే ముందు, వెనుక ఉంటుంది గానీ.. చావు మాత్రం అందరికీ కామన్. అయితే ఒక్కొక్కరు చనిపోయే విధానం చూసినప్పుడు అయ్యో పాపం అని అనిపిస్తుంటుంది. కొందరు అప్పటిదాకా సంతోషంగా ఉంటారు.. అంతలోనే మృత్యుఒడిలోకి జారుకుంటుంటారు. ఇంకొందరు అనూహ్య ప్రమాదాలకు గురై ప్రాణాలను వదులుతుంటారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఇలాంటి సంఘటనలన్నీ వీడియోల రూపంలో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి చనిపోయిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. హర్యానాలోని (Haryana) రోహ్తక్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. హార్ధిక్ (16) అనే యువకుడు బాస్కెట్ బాల్ ప్లేయర్. లఖన్ మజ్రాలోని బాస్కెట్ బాల్ (Basketball) స్టేడియంలో ఇటీవల ఇతను ప్రాక్టీస్ చేస్తున్నాడు. బాస్కెట్ బాల్ ఆడే క్రమంలో కోర్టు చివరకు వచ్చి.. అక్కడ ఉన్న స్తంభాన్ని పట్టుకుని వేలాడాడు. అయితే స్తంభాన్ని పట్టుకోగానే.. ఒక్కసారిగా అది కూలిపోయి అతడి ఛాతీపై పడింది.
అంత బరువున్న స్తంభం.. ఒక్కసారిగా ఛాతిపై పడడంతో (Basketball player dies after falling from pole) అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీన్ని గమనించిన స్నేహితులు పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. అతి కష్టం మీద స్తంభాన్ని పైకి ఎత్తి పక్కకు తీశారు. కొన ఊపిరితో ఉన్న హార్దిక్‌ను చికిత్స నిమత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పటిదాకా గేమ్స్ ఆడిన అతను.. అంతలోనే ఇలా అనుకోకుండా మృత్యువాత పడడం అక్కడున్న వారందరినీ కలిచివేసింది.
ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, ఈ ప్రమాద ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అయ్యో పాపం.. ఎంత ఘోరం జరిగింది’.. అంటూ కొందరు, ‘చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2,200కి పైగా లైక్‌లు, 1.58 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పడేసిన ప్లాస్టిక్ బాటిల్‌ను ఇంతకంటే బాగా ఎవరూ వాడలేరేమో..
వీళ్లకు ఎక్కడా స్థలం లేనట్లుంది.. రన్నింగ్ రైల్లో ఏకంగా డోరు వద్దే నిలబడి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి