Optical illusion: మీ చూపు నిజంగా పవర్‌ఫుల్ అయితే.. ఈ చిత్రంలో కుందేలు ఎక్కడుందో 10 సెకన్లలో గుర్తించండి చూద్దాం..
ABN , Publish Date - Nov 25 , 2025 | 03:48 PM
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో పెద్దవారితో పాటు పిల్లలు కలిసి పార్క్‌లో చెత్తాచెదారం కవర్లలోకి ఎత్తేస్తుంటారు. ఆ పార్క్‌లో మొక్కల చుట్టూ ప్లాస్టిక్ బాటిళ్లు, పేపర్లు, ఇనుప వస్తువులు పడి ఉంటాయి. అయితే ఇదే చిత్రంలో ఓ కుందేలు కూడా దాక్కుని ఉంది. అదెక్కడుందో 10 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..
ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు కాలక్షేపంతో పాటూ మెడదుకు మేతగా కూడా ఉపయోగపడతాయనేది అందరికీ తెలిసిందే. వీటిలో కొన్ని పజిల్ చిత్రాలు చూస్తే పైకి సాధారణంగా కనిపిస్తుంటాయి. కానీ అందులోని పజిల్స్‌ను పరిష్కరించడం పెద్ద సవాలుగా మారుతుంటుంది. ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు పిల్లలతో పాటూ పెద్దలు కూడా ప్రయత్నిస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా, మీ కోసం ఓ ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఈ చిత్రంలో దాక్కుని ఉన్న కుందేలును 10 సెకన్లలో కనిపెట్టేందుకు ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో పెద్దవారితో పాటు పిల్లలు కలిసి పార్క్‌లో చెత్తాచెదారం కవర్లలోకి ఎత్తేస్తుంటారు. ఆ పార్క్‌లో మొక్కల చుట్టూ ప్లాస్టిక్ బాటిళ్లు, పేపర్లు, ఇనుప వస్తువులు పడి ఉంటాయి. అక్కడున్న వారు వాటన్నింటినీ ఎత్తేస్తుంటారు. వారికి పిల్లలకు కూడా సహరిస్తుంటారు.
ఇక్కడ కనిపిస్తున్న చెట్ల పొదల్లో కొన్ని పక్షులను కూడా చూడొచ్చు. ఆ పార్క్ (Park) పక్కనే నీటి కొలను కూడా ఉంటుంది. ఇంతవవరకూ అంతా ఓకే గానీ.. ఇక్కడే మీ కళ్లకు పరీక్ష పెట్టబోతున్నాం. ఇదే చిత్రంలో (Hidden Rabbit) ఓ కుందేలు కూడా దాక్కుని ఉంది.
అయితే ఆ కుందేలు అంత సులభంగా మీ కంటికి కనిపించదు. అలాగని దాన్ని కనిపెట్టడం కష్టం అనుకుంటే పొరపాటే. కాస్త నిశితంగా పరిశీలిస్తే.. ఆ కుందేలును ఇట్టే కనిపెట్టేయవచ్చు. చాలా మంది ఆ కుందేలును కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు.
ఇంకెందుకు ఆలస్యం.. ఆ కుందేలు ఎక్కడుందో కనుక్కునేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ కనిపెట్టలేకుంటే మాత్రం ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి..
ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..
మరిన్ని పజిల్ చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..