Share News

Plastic Bottle Jugaad Video: పడేసిన ప్లాస్టిక్ బాటిల్‌ను ఇంతకంటే బాగా ఎవరూ వాడలేరేమో..

ABN , Publish Date - Nov 23 , 2025 | 01:59 PM

పక్కన పడేసిన ప్లాస్టిక్ బాటిల్‌‌‌ను ఓ వ్యక్తి తిరిగి వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. బాటిల్‌ను సగానికి కత్తిరించిన అతను.. దాన్ని తిరిగి వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు..

Plastic Bottle Jugaad Video: పడేసిన ప్లాస్టిక్ బాటిల్‌ను ఇంతకంటే బాగా ఎవరూ వాడలేరేమో..

తెలివి ఒకరి సొత్తు కాదు. కొందరు తమ బుర్రకు పదును పెట్టి అద్భుతాలు చేస్తుంటారు. ఎందుకూ పనికిరావు అనుకున్న వస్తువులను కొందరు వాడే విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి వింత ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పక్కన పడేసిన ప్లాస్టిక్ బాటిల్‌ను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఆహా.. ఏం వాడకమయ్యా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పక్కన పడేసిన ప్లాస్టిక్ బాటిల్‌‌‌ను (plastic bottle) ఓ వ్యక్తి తిరిగి వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. బాటిల్‌ను సగానికి కత్తిరించిన అతను.. చీపురు మొదలుకు తొడిగేశాడు.


ఆ తర్వాత గ్యాస్ స్టవ్‌పై బాటిల్‌ను హీట్ చేశాడు. చివరకు చూస్తే ప్లాస్టిక్ బాటిల్ కాస్తా.. చీపురు హ్యాండిల్‌గా (Man who Attached Plastic Bottle to Broom) మారిపోయిందన్నమాట. ఇతడి వినూత్న ప్రయోగం నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలాంటి టాలెంట్ ఇండియా దాటి వెళ్లకూడదు’.. అంటూ కొందరు, ‘వాటర్ బాటిల్‌‌‌ను ఇంతకంటే బాగా ఎవరూ వాడలేరేమో’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Updated Date - Nov 23 , 2025 | 03:46 PM