Lion Viral Video: పట్టు తప్పిన సింహం.. చెట్టుపై ఉండగా ఏమైందో చూస్తే..
ABN , Publish Date - Nov 21 , 2025 | 09:13 PM
ఓ సింహం వేటాడిన జంతువును నోట కరుచుకుని చెట్టు ఎక్కుతుంది. చెట్టుపై మాంసం తిన్న తర్వాత.. మిగిలిన కొద్దిపాటి మాంసాన్ని నోట కరుచుకుని పైనుంచి దిగాలని చూస్తుంది. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సింహం అంటేనే పంజా గుర్తుకొస్తుంది. ఒక్కసారి దాని పంజా విసిరిందంటే.. ఎదురుగా ఎలాంటి జంతువున్నా కూడా నేల కూలాల్సిందే. అందుకే సింహం వేటకు బయలుదేరిందంటే.. మిగతా జంతువులన్నీ భయంతో వణికిపోతుంటాయి. ఇంతటి క్రూరమైన సింహాల విషయంలోనూ కొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఏదో చేయబోతే చివరికి ఇంకేదో అవుతుంటుంది. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ సింహం చెట్టుపై ఉండగా.. ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ సింహం వేటాడిన జంతువును నోట కరుచుకుని చెట్టు ఎక్కుతుంది. చెట్టుపై మాంసం తిన్న తర్వాత.. మిగిలిన కొద్దిపాటి మాంసాన్ని నోట కరుచుకుని పైనుంచి దిగాలని చూస్తుంది. అయితే ఈ క్రమంలో రెండు మూడు అడుగులు వేయగానే.. పైనుంచి ధబేల్‌మని కిందపడుతుంది.
అంత భారీ సింహం ఒక్కసారిగా కిందపడడంతో (lion fell from tree) దానికి చుక్కలు కనిపించాయి. పైకి లేచి ముందుకు వెళ్లాలని చూస్తుంది. కానీ పైకి కనిపించకున్నా కూడా లోపల గాయాలవడంతో ముందుకు కదల్లేకపోతుంది. రెండు అడుగులు వేసి కుప్పకూలిపోయింది. దీన్ని బట్టి చూస్తే ఆ సింహానికి బాగా దెబ్బలు తగిలినట్లు అర్థమవుతోంది. ఈ ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘పట్టు తప్పిన సింహం’.. అంటూ కొందరు, ‘ఈ సింహానికి పెద్ద కష్టమే వచ్చిందిగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లు, లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
రైలు రద్దీగా ఉంటే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా..
వాషింగ్‌మిషిన్ వాడేది దుస్తుల కోసమే అనుకుంటున్నారా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి