Share News

Elephants Viral Video: నీళ్లలో పడిపోయిన ఏనుగు పిల్ల.. చివరకు పెద్ద ఏనుగులు చేసిన పని చూస్తే..

ABN , Publish Date - Nov 23 , 2025 | 01:05 PM

ఓ ఏనుగు పిల్ల నీళ్లు తాగే క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. బయటికి రాలేక గిలగిలా కొట్టుకుంటూ ఉంది. ఇంతలో దూరం నుంచి గమనించిన పెద్ద ఏనుగులు.. పరుగు పరుగున అక్కడికి చేరుకున్నాయి..

Elephants Viral Video: నీళ్లలో పడిపోయిన ఏనుగు పిల్ల.. చివరకు పెద్ద ఏనుగులు చేసిన పని చూస్తే..

ఏనుగులు చూసేందుకు ఎంత భారీగా కనిపిస్తుంటాయో.. అంతే స్థాయిలో బీభత్సం సృష్టిస్తుంటాయి. అలాగే కొన్నిసార్లు అంతే ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంకొన్నిసార్లు అవి చేసే పనులు చూస్తే.. గుండెలను హత్తుకునేలా ఉంటాయి. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ఏనుగు పిల్ల నీళ్లలో పడిపోయింది. ఇది గమనించిన పెద్ద ఏనుగులు చివరకు ఏం చేశాయో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఏనుగు పిల్ల నీళ్లు తాగే క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. బయటికి రాలేక గిలగిలా కొట్టుకుంటూ ఉంది. ఇంతలో దూరం (Baby elephant falls into water) నుంచి గమనించిన పెద్ద ఏనుగులు.. పరుగు పరుగున అక్కడికి చేరుకున్నాయి. ముందుగా తల్లి ఏనుగు తన పిల్లను పట్టుకుని ఒడ్డుకు లాగేందుకు ప్రయత్నించింది.


ఇంతలో మిగతా ఏనుగులన్నీ కలిసి.. దాన్ని ఎంతో (Elephants save baby elephant from water) జాగ్రత్తగా బయటికి తీశాయి. చాలా మంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల రాక్షసంగా వ్యవహరిస్తున్న ప్రస్తుత తరుణంలో.. జంతువులను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏనుగులు చేసిన ఈ పని అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఏనుగుల ప్రేమ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఏనుగులను చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 1.9 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఇలా చనిపోతుందని ఎవరైనా అనుకున్నారా.. ఎద్దుల బండి నడుపుతుండగా..

బొద్దింకలతో కాఫీ.. దీని రేటు, ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 23 , 2025 | 01:06 PM