Viral Video: గంగానదిపై మృతదేహానికి అంత్యక్రియలు.. అనుమానం వచ్చి దుప్పటి తీసి చూడగా.. షాకింగ్ సీన్..
ABN , Publish Date - Nov 28 , 2025 | 08:53 PM
కొందరు ఓ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహిస్తు్న్నారు. అయితే కాసేపు ఉంటే శవానికి మంట పెడతారు అనగా.. స్థానికులకు అనుమానం కలిగింది. దీంతో వారి వద్దకు వెళ్లి.. శవంపై కప్పిన దుప్పటి పక్కకు తీశారు. చివరకు చూడగా షాకింగ్ సీన్ కనిపించింది..
ప్రస్తుతం ప్రపంచం మొత్తం డబ్బు చుట్టే తిరుగుతోంది. డబ్బు కోసం కొందరు ఎలాంటి నేరాలు చేయడానికైనా వెనకాడడడం లేదు. మరికొందరు పోలీసులకు దొరక్కుండా కొత్త కొత్త పద్ధతుల్లో నేరాలు చేస్తున్నారు. ఇంకొందరు డబ్బుల కోసం వేసే స్కెచ్‌లు చూస్తే పోలీసులు కూడా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన ఘటనల గురించి సోషల్ మీడియాలో వార్తలు, వీడియోల రూపంలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఘటన ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇద్దరు వ్యక్తులు శ్మశాన వాటికలో ఓ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అనుమానం వచ్చి వారిని విచారించగా.. షాకింగ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) గంగా నదిపై ఉన్న బ్రజ్‌ఘాట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు ఓ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహిస్తు్న్నారు. అయితే కాసేపు ఉంటే శవానికి మంట పెడతారు అనగా.. స్థానికులకు అనుమానం కలిగింది. దీంతో వారి వద్దకు వెళ్లి.. శవంపై కప్పిన దుప్పటి పక్కకు తీశారు. తీరా చూస్తే.. అక్కడ మృతదేహం స్థానంలో బొమ్మ ఉంది. దీంతో వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మనిషి బొమ్మకు అంత్యక్రియలు చేయడం ఏంటీ.. అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వారి ప్రవర్తన అనుమానంగా ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీకి (Delhi) చెందిన ఇద్దరు వస్త్ర వ్యాపారులు (Cloth Merchants) మాస్టర్ ప్లాన్ వేశారు. ఫ్రీగా బీమా కొట్టేందుకు సినిమా స్టైల్లో స్కె్చ్ గీశారు. తమ పథకంలో భాగంగా ముందుగా.. తమ దుకాణంలో పని చేసే సేవకుడి మీద రూ.50 లక్షలకు బీమా చేయించారు. అతను అర్ధాంతరంగా చనిపోతే ఆ మొత్తం వస్తుందన్నమాట. అయితే సమాజంలో ఆ వ్యక్తి చనిపోయినట్లు అందరినీ నమ్మించాలని ప్లాన్ చేశారు. ఇందుకోస అతడి సైజులో ఉండే ఓ బొమ్మను తీసుకుని, దాన్ని అంత్యక్రియలు (Funeral for plastic doll) చేసేందుకు ఉత్తరప్రదేశ్‌లోని గంగా నది వద్దకు వచ్చారు. అక్కడ మృతదేహం వివరాలు నమోదు చేసే సమయంలో తమ దుకాణంలో పని చేసే వ్యక్తి పేరును రాశారు.
తద్వారా అతడి పేరు మీద డెత్ సర్టిఫికెట్ తీసుకుని, దాని సాయంతో బీమా డబ్బులు పొందాలనేది వారి ప్లాన్. అయితే స్థానికులు పసిగట్టడంతో బెడిసికొట్టిందన్నమాట. కమల్ సోమానీ, ఆశిష్ ఖురానా అనే ఇద్దరు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బొమ్మకు అంత్యక్రియలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. వీళ్ల ప్లాన్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’.. అంటూ మరికొందరు, ‘తప్పు చేసిన వాళ్లు తప్పనిసరిగా దొరికిపోవాల్సిందే’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 12 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పడేసిన ప్లాస్టిక్ బాటిల్‌ను ఇంతకంటే బాగా ఎవరూ వాడలేరేమో..
వీళ్లకు ఎక్కడా స్థలం లేనట్లుంది.. రన్నింగ్ రైల్లో ఏకంగా డోరు వద్దే నిలబడి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి