Parrot Funny Video: పూర్తిగా అప్‌డేట్ అయిన చిలుక.. ఏం చేస్తుందో చూస్తే నోరెళ్లబెడతారు..
ABN , Publish Date - Nov 28 , 2025 | 06:05 PM
చిలుక అనగానే మనకు టక్కున గుర్తొచ్చే సీన్... చిలుక జోస్యం. పంజరంలో నుంచి బయటికి వచ్చిన చిలుక.. బయట పరిచి ఉన్న అనేక కార్డ్స్‌లో ఒకదాన్ని ముక్కుతో పట్టుకుని తన యజమాని చేతికి అందిస్తుంది. ఆ వ్యక్తి దాన్ని చూసి వచ్చిన వారికి జ్యోతిష్యం చెబుతాడు. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే..
‘పాత తెలుగు చిత్రాల్లో బుగ్గపై గాటు పెట్టుకుని, మీసాలు తిప్పుకొంటూ, లుంగీ కట్టుకుని విలన్ 'ఏయ్ కబాలి' అని పిలవగానే, వంగి వినయంగా 'ఎస్ బాస్' అంటూ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నావా?... కబాలి... రా’.. అనే రజనీకాంత్ కబాలి సినిమా డైలాగ్ గుర్తుందా.. ఇప్పుడీ డైలాగ్ ఎందుకు గుర్తుచేస్తున్నామంటే.. చిలుక వీడియో చూస్తే మీకే తెలుస్తుంది.
’ఏ చిలుకా.. బయటికి వచ్చి ఇతడి జోస్యం చెప్పు.. అని పిలవగానే.. పంజరంలో నుంచి వినయంగా బయటికి వచ్చి.. అక్కడున్న కార్డ్స్‌లో ఒకదాన్ని బయటికి తీ చేతికి ఇచ్చే ఆ నాటి పాత చిలుకను అనుకున్నారా.. పూర్తిగా అప్‌డేట్ అయిన చిలుకను నేను’.. అని అంటున్నట్లుగా ఓ చిలుక ప్రవర్తించింది. స్మార్ట్ ఫోన్‌ను ఆపరేట్ చేస్తున్న చిలుకను చూసి అంతా రజనీకాంత్ డైలాగ్‌ను గుర్తు చేసుకుంటున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చిలుక అనగానే మనకు టక్కున గుర్తొచ్చే సీన్... చిలుక జోస్యం. పంజరంలో నుంచి బయటికి వచ్చిన చిలుక.. బయట పరిచి ఉన్న అనేక కార్డ్స్‌లో ఒకదాన్ని ముక్కుతో పట్టుకుని తన యజమాని చేతికి అందిస్తుంది. ఆ వ్యక్తి దాన్ని చూసి వచ్చిన వారికి జ్యోతిష్యం చెబుతాడు. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఓ చిలుక తన సహజ ప్రవర్తనకు భిన్నంగా వ్యవహరించడం చూసి అంతా అవాక్కవుతున్నారు. జోస్యం చెప్పాల్సిన చిలుక.. పూర్తిగా అప్‌డేట్ అయినట్లుగా స్మార్ట్ ఫోన్‌ను (Parrot operating Smart Phone) ఆపరేట్ చేస్తోంది. అది కూడా ఎంతో ఈజీగా, దానిపై పూర్తిగా అవగాహన ఉన్నట్లుగా ఫోన్‌ను ఆపరేట్ చేస్తోంది. తన ముక్కుతో ఫోన్ స్క్రీన్‌పై టచ్ చేస్తూ వీడియోలు చూస్తోంది.
ఇలా ఆ చిలుక చాలా సేపు స్మార్ట్ ఫోన్‌లో వీడియోలు, ఫొటోలను ఆసక్తిగా తిలకించడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. ఈ చిలుక తెలివి మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘పూర్తిగా అప్‌డేట్ అయిన చిలుక’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 2.3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పడేసిన ప్లాస్టిక్ బాటిల్‌ను ఇంతకంటే బాగా ఎవరూ వాడలేరేమో..
వీళ్లకు ఎక్కడా స్థలం లేనట్లుంది.. రన్నింగ్ రైల్లో ఏకంగా డోరు వద్దే నిలబడి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి