Road Accident Viral Video: చిన్న తొందరపాటుతో జీవితం ఛిద్రం.. ఇందులో తప్పెవరిదో మీరే చెప్పండి..
ABN , Publish Date - Nov 29 , 2025 | 05:05 PM
ఓ వ్యక్తి తన బైకుపై మహిళను ఎక్కించుకుని వెళ్తు్న్నాడు. ఈ క్రమంలో మెయిన్ రోడ్డు దాటి అవతలి వైపు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతను చేసిన పనికి చివరకు ఏమైందో మీరే చూడండి..
పది నిముషాలు ఆలస్యమైతే ప్రాణాలేమీ పోవు. కానీ చాలా మంది త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరలో చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. మరికొందరు తొందరపాటు, ఏమరపాటుతో ప్రాణాలు పోగొట్టుకుంటుంటారు. ఇంకొన్నిసార్లు కొందరి నిర్లక్ష్యం వల్ల అనేక మంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మహిళను తన బైకుపై ఎక్కించుకుని వెళ్తున్నాడు. రోడ్డు దాటే క్రమంలో బస్సు ఢీకొట్టడంతో ఎగిరిదూరంగా పడిపోయారు. ఇందులో తప్పు ఎవరిదో మీరే చెప్పండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన హర్యానాలో (Haryana) జరిగినట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి తన బైకుపై మహిళను ఎక్కించుకుని వెళ్తు్న్నాడు. ఈ క్రమంలో మెయిన్ రోడ్డు దాటి అవతలి వైపు వెళ్లాల్సి వచ్చింది. ఈ సమయంలో ఎవరైనా రోడ్డు దగ్గరికి రాగానే.. అటూ, ఇటూ వాహనాలు వస్తున్నాయో.. లేదో చూసుకుని దాటాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యక్తి ఎక్కడా ఆగకుండా నేరుగా రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు.
అదే సమయంలో అటుగా వచ్చిన బస్సు.. (Bus hits bike) బైకును బలంగా ఢీకొట్టింది. దీంతో బైకుపై ఉన్న ఇద్దరూ ఎగిరి దూరంగా పడిపోయారు. బైకు రోడ్డు దాటడం చూసి బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. కానీ అప్పటికే సమీపానికి రావడం వల్ల బస్సు కంట్రోల్ కాలేదు. వీడియోలో తెలిపిన సమాచారం ప్రకారం.. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇంకొకరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘పూర్తిగా బైకర్‌దే తప్పు.. చూసుకోకుండా రోడ్డు దాటడం వల్లే ఇదంతా జరిగింది’.. అంటూ కొందరు, ‘రోడ్డు దాటే ముందు అంతా జాగ్రత్తగా ఉండాలి’.. అంటూ మరికందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15 వేలకు పైగా లైక్‌లు, 3.26 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పడేసిన ప్లాస్టిక్ బాటిల్‌ను ఇంతకంటే బాగా ఎవరూ వాడలేరేమో..
వీళ్లకు ఎక్కడా స్థలం లేనట్లుంది.. రన్నింగ్ రైల్లో ఏకంగా డోరు వద్దే నిలబడి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి