Share News

Watch Video: ఈమె మనిషా... రాక్షసా.. ఇలాంటి వారిని ఏం చేయాలో మీరే చెప్పండి..

ABN , Publish Date - Nov 30 , 2025 | 07:48 PM

జీడిమెట్ల పీఎస్ పరిధి షాపూర్ నగర్‌లో పూర్ణిమా స్కూల్‌లో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారిపై ఆయా పైశాచిక దాడి చేసింది. నర్సరీ చదువుతున్న చిన్నారిపై స్కూల్ ఆయా దాడికి పాల్పడింది. పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి తీసుకెళ్లే క్రమంలో..

Watch Video: ఈమె మనిషా... రాక్షసా.. ఇలాంటి వారిని ఏం చేయాలో మీరే చెప్పండి..

మేడ్చల్: చిన్న పిల్లలపై దాడులు పెరిగిపోతున్నాయి. నోరు లేదు, ఎవరికీ చెప్పుకోలేరులే అనే కారణంతో చాలా మంది చిన్నారులపై తమ ప్రతాపం చూపిస్తూ పైశాసిక ఆనందం పొందుతున్నారు. తరచూ చిన్నారులపై తల్లిదండ్రులు, టీచర్లు, ఇంటి పక్కన ఉండే వారు దాడికి పాల్పడడం ఎక్కడో చోట జరుగుతూనే ఉంది. తాజాగా, జీడిమెట్ల షాపూర్‌నగర్‌ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏ పాపం తెలీని చిన్నారిపై ఆయా దాడికి పాల్పడింది. విచరక్షణా రహితంగా కొట్టడంతో ప్రస్తుతం చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఆయాను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.


జీడిమెట్ల పీఎస్ పరిధి షాపూర్ నగర్‌లో పూర్ణిమా స్కూల్‌లో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారిపై ఆయా పైశాచిక దాడి చేసింది. నర్సరీ చదువుతున్న చిన్నారిపై స్కూల్ ఆయా దాడికి పాల్పడింది. పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి తీసుకెళ్లే క్రమంలో భవనం ఆవరణలో చిన్నారిపై దాడికి పాల్పడింది. చేతులతో కొడుతూ, కాళ్లతో తొక్కుతూ రాక్షసంగా ప్రవర్తించింది.


ఈ ఘటనను స్కూల్ పక్కన ఇంటిపై ఉన్న యువకుడు గమనించి, తన ఫోన్‌లో వీడియోలు తీశాడు. నిన్న సాయంత్రం నుంచి చిన్నారి ఆహారం తీసుకోలేదు. దీనికి తోడు పాపకు తీవ్ర జ్వరంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే పరీక్షించిన వైద్యులు.. చిన్నారిపై పాశవికంగా దాడి జరిగినట్టు డాక్టర్లు గుర్తించారు. పాపపై జరిగిన దాడి ఘటనపై వీడియో ఆధారంగా చిన్నారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చిన్నారిపై దాడి చేసిన ఆయాను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల నిబంధనను ఉల్లంగిస్తున్నారు.. కవిత ఫైర్

నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం: ఎంపీ సురేశ్‌రెడ్డి

Read Latest TG News and National News

Updated Date - Nov 30 , 2025 | 07:50 PM