Home » Crime News
శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ లో ఒక సీనియర్ ఆర్మీ అధికారి రెచ్చిపోయాడు. స్పైస్ జెట్ విమాన సిబ్బందిని చితక్కొట్టాడు. దీంతో నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. కొందరు వెన్నులు విరిగిపోయి, మరికొందరు గాయాలతో ఆస్పత్రిలో చేరారు.
‘ఉచితం’ మాటున నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వేస్తున్నారు. పగలంతా ఒక ప్రాంతంలో డంప్ చేస్తున్నారు. రాత్రిళ్లు రాష్ట్ర సరిహద్దులు దాటించి తమిళనాడుకు తీసుకెళుతున్నారు. ఇలా రాత్రింబవళ్లు ఇసుక దందా సాగిస్తున్నా అధికారులు కిమ్మనడంలేదు.
చీకటి పడితే చాలు.. ఆ వెంటనే ఎక్స్కవేటర్ల రొద మొదలవుతుంది. ప్రభుత్వ భూమిని చీల్చి గ్రావెల్‌ను తవ్వుతాయి. టిప్పర్లు రయ్‌మంటూ పరుగులు తీస్తాయి. ఇలా పూలతోటమిట్టలో మొదలయ్యే గ్రావెల్ అక్రమ రవాణా సూళ్లూరుపేట, తడ ప్రాంతాలకు సాగుతోంది.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
చేపల కోసం వేసిన వలే అతడికి యమపాశమైంది. వలలో చిక్కి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. భద్రాద్రి జిల్లా గుండాల మండలం మామకన్ను గ్రామానికి చెందిన కల్తి ప్రవీణ్‌ప్రకాష్(25) శుక్రవారం కొందరు గ్రామస్థులతో కలిసి ఆళ్లపల్లి మండలం అనంతోగు వద్ద కిన్నెరసాని వాగులో ఇటీవల నిర్మించిన చెక్‌డ్యాం మడుగులో చేపలు పట్టేందుకు వెళ్లారు.
మద్యం సేవించి ఇంటికొచ్చిన కుమారులను తల్లి మందలించడంతో ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కాంచీపురం జిల్లాలో చోటుచేసుకుంది. కమ్మవారపాళయం గ్రామానికి చెందిన జయలక్ష్మి, పెద్ద కుమారుడు విఘ్నేష్ (28), చిన్న కుమారుడు గణేష్ (24) శ్రీపెరుంబుదూర్ ప్రాంతంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నారు.
కర్ణాటకలోని ధర్మస్థలలో మృతదేహాల ఆనవాళ్ల కోసం సిట్ జరుపుతున్న తవ్వకాల్లో మూడో రోజు ఓ అస్థిపంజరం
ధర్మస్థల.. ఇదే ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్. నా చేతులతో నేను కొన్ని వందల శవాలను ధర్మస్థలలో అనేక చోట్ల పూడ్చిపెట్టాను. అందులో వివస్త్రలైన మహిళలు, బడికి వెళ్లే అమ్మాయిల శవాలు కూడా ఉన్నాయి. ప్రాణభయంతో ఆ పని చేశాను. అంటూ..
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హృదయ విదారక సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూరి దుర్గా శ్రీనివాసులు, వేల్పూరి దుర్గారాణి (22) భార్యాభర్తలు.
పెళ్లైన ఓ కొత్త జంట హనీమూన్ ట్రిప్‌కు మేఘాలయ వెళ్లిన విషాద ఘటన దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో చనిపోయిన రాజా రఘువంశీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఇప్పుడు ఇదే అంశంపై ఓ సినిమా రాబోతుంది.