Share News

Wedding Funny Video: పెళ్లి వేదికపై డబ్బు వెదజల్లిన మహిళ.. వరుడు చేసిన పనేంటో చూడండి..

ABN , Publish Date - Nov 29 , 2025 | 09:15 PM

ఓ వివాహ కార్యక్రమంలో వేదికపై తమాషా సంఘటన చోటు చేసుకుంది. వధూవరులు వేదికపై ఉండగా.. అంతా ఒక్కొక్కరుగా వచ్చి వారితో ఫొటోలు దిగుతున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ వేదిక పైకి వచ్చి.. వారి పక్కన నిలబడింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Wedding Funny Video: పెళ్లి వేదికపై డబ్బు వెదజల్లిన మహిళ.. వరుడు చేసిన పనేంటో చూడండి..

ఎక్కడ ఏ వివాహం జరిగినా.. అందుకు సంబంధించిన ఏదో ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటుంది. వాటిలో వినూత్నంగా ఉన్న ఘటనలు తెగ వైరల్ అవుతుంటాయి. ఇలాంటి వీడియోల్లో కొన్ని షాక్ అయ్యేలా ఉంటే.. మరికొన్ని తెగ నవ్వించేలా ఉంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో తెగ సందడి చేస్తోంది. ఓ వివాహ కార్యక్రమంలో వేదికపై ఓ మహిళ డబ్బు వెదజల్లింది. ఈ సమయంలో వరుడు చేసిన పనికి అంతా పగలబడి నవ్వుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వేదికపై తమాషా సంఘటన చోటు చేసుకుంది. వధూవరులు వేదికపై ఉండగా.. అంతా ఒక్కొక్కరుగా వచ్చి వారితో ఫొటోలు దిగుతున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ వేదిక పైకి వచ్చి.. వారి పక్కన నిలబడింది. చేతిలో ఉన్న సంచిలో నుంచి కరెన్సీ నోట్లను బయటికి తీసి గాల్లోకి వెదజల్లింది. దీంతో అక్కడున్న అతిథులంతా డబ్బుల కోసం ఎగబడ్డారు.


ఎవరికి చిక్కిన నోట్లను వారు తీసుకుని జేబులో వేసుకుంటున్నారు. ఇంతవరకూ ఒక ఎత్తైతే.. వారితో పాటూ వరుడు కూడా అటూ, ఇటూ పరుగులు పెడుతూ కిందపడ్డ నోట్లను ఎత్తుకున్నాడు. ఈ క్రమంలో సదరు మహిళ.. ఆ వరుడిని అలా చేయొద్దంటూ అడ్డుకుంటుంది. అయినా ఆ వరుడు అదేమీ పట్టించుకోకుండా (Groom picks up fallen currency notes) కరెన్సీ నోట్లను ఎత్తుకుని జేబులో వేసుకున్నాడు.


ఈ ఘటన అక్కడున్న వారిని తెగ నవ్వించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ వరుడి భలే ఫన్నీగా ఉన్నాడే’.. అంటూ కొందరు, ‘పెళ్లి కంటే డబ్బులే ముఖ్యం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 74 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

పడేసిన ప్లాస్టిక్ బాటిల్‌ను ఇంతకంటే బాగా ఎవరూ వాడలేరేమో..

వీళ్లకు ఎక్కడా స్థలం లేనట్లుంది.. రన్నింగ్ రైల్లో ఏకంగా డోరు వద్దే నిలబడి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 29 , 2025 | 09:55 PM