Share News

Students Funny Video: అంబులెన్స్ ఏం చేస్తుంది.. అన్న ప్రశ్నకు పిల్లాడి సమాధానం చూస్తే.. పగలబడి నవ్వాల్సిందే..

ABN , Publish Date - Nov 30 , 2025 | 03:23 PM

ఓ టీచర్ తన విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు. ఇంతలో ఆ టీచర్ విద్యార్థులను ఓ ప్రశ్న అడిగాడు. అంబులెన్స్ ఏం చేస్తుందో.. మీలో ఎవరైనా చెప్పగలరా అంటూ అడిగాడు. దీంతో వారిలో ఓ విద్యార్థి.. నేను చెబుతా సార్.. అని చేయి పైకి ఎత్తుతాడు. చివరికి అతను చెప్పిన సమాధానం విని అంతా పగలబడి నవ్వుకున్నారు..

Students Funny Video: అంబులెన్స్ ఏం చేస్తుంది.. అన్న ప్రశ్నకు పిల్లాడి సమాధానం చూస్తే.. పగలబడి నవ్వాల్సిందే..

టీచర్, విద్యార్థుల మధ్య అప్పుడప్పుడూ ఆసక్తికర, తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. టీచర్లు అడిగే ప్రశ్నలకు విద్యార్థులు వింత వింత సమాధానాలు చెబుతుంటారు. అవి లాజిక్‌గా అనిపించినా చూసే వారికి తెగ నవ్వుతెప్పిస్తుంటాయి. మరికొందరు విద్యార్థులు చెప్పే సమాధానాలు వింటే టీచర్లను కూడా తెగ నవ్విస్తుంటాయి. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అంబులెన్స్ ఏం చేస్తుంది.. అన్న ప్రశ్నకు విద్యార్థి సమాధానం విని టీచర్‌తో పాటూ మిగతా విద్యార్థులంతా పగలబడి నవ్వారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ టీచర్ తన విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు. ఇంతలో ఆ టీచర్ విద్యార్థులను ఓ ప్రశ్న అడిగాడు. అంబులెన్స్ (Ambulance) ఏం చేస్తుందో.. మీలో ఎవరైనా చెప్పగలరా అంటూ అడిగాడు. దీంతో వారిలో ఓ విద్యార్థి.. నేను చెబుతా సార్.. అని చేయి పైకి ఎత్తుతాడు. చెప్పు అని టీచర్ అనగానే.. కుయ్.. కుయ్.. కుయ్.. అంటూ అంబులెన్స్ శబ్ధాలు చేసి.. ఇలా చేస్తుంది సార్ అని అన్నాడు.


విద్యార్థి సమాధానంతో టీచర్‌తో పాటూ (Teacher laughs after hearing student's answer) చుట్టూ ఉన్న వారంతా పగలబడి నవ్వుకుంటారు. ఆ తర్వాత టీచర్.. ‘ఇంకా ఏం చేస్తుంది’.. అని అడగ్గానే.. రోగులను కూడా తీసుకెళ్తుంది సార్.. అని అసలు సమాధానం చెబుతాడు. దీంతో ఆ టీచర్.. ఇది ముందు చెప్పాలి.. అంటూ నవ్వుకుంటూనే ఆ విద్యార్థిని మెచ్చుకున్నాడు. ఇలా ఆ విద్యార్థి అంబులెన్స్ శబ్ధాలు చేస్తూ అందరినీ బాగా నవ్వించాడన్నమాట.


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ విద్యార్థి మరీ కామెడీగా ఉన్నాడుగా’.. అంటూ కొందరు, ‘సరైన సమాధానం చెప్పాడు.. ఇంతకంటే బాగా ఎవరూ చెప్పలేరేమో’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 22 వేలకు పైగా లైక్‌లు, 5.39 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

పెళ్లి వేదికపై డబ్బు వెదజల్లిన మహిళ.. వరుడి చేసిన పనేంటో చూడండి..

వీళ్లకు ఎక్కడా స్థలం లేనట్లుంది.. రన్నింగ్ రైల్లో ఏకంగా డోరు వద్దే నిలబడి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 30 , 2025 | 05:46 PM