Share News

Watch Viral Video: సోమరితనాన్ని వదిలేయమనేది ఇందుకే.. ఇతడి విషయంలో ఏం జరిగిందో చూస్తే..

ABN , Publish Date - Nov 27 , 2025 | 06:58 PM

సోమరితనం మనిషికి పెద్ద శత్రువు. దీనికి అలవాటుపడిన వారు ఏ పనీ చేయకుండా, ఏ లక్ష్యం లేకుండా ఉంటారు. కొందరు ఈ నిర్లక్ష్యం కారణంగా తీవ్రంగా నష్టపోతుంటారు కూడా. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

Watch Viral Video: సోమరితనాన్ని వదిలేయమనేది ఇందుకే.. ఇతడి విషయంలో ఏం జరిగిందో చూస్తే..

ధూమపానానికి తప్పదు భారీ మూల్యం.. ఈ హెచ్చరిక అనేక సందర్భాల్లో వింటుంటాం, చూస్తుంటాం. అయితే ధూమపానం కంటే ప్రమాదకరమైనది.. నిర్లక్ష్యం అని చాలా మందికి తెలీదు. నిర్లక్ష్యం కారణంగా చాలా మంది అనేక రకాలుగా నష్టపోతుంటే.. కొన్నిసార్లు ప్రాణాలు పోవడానికి కూడా కారణమవుతుంటుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బద్దకించడంతో చివరకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సోమరితనం మనిషికి పెద్ద శత్రువు. దీనికి అలవాటుపడిన వారు ఏ పనీ చేయకుండా, ఏ లక్ష్యం లేకుండా ఉంటారు. కొందరు ఈ నిర్లక్ష్యం (Negligence) కారణంగా తీవ్రంగా నష్టపోతుంటారు కూడా. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెటిజన్లు అవాక్కయ్యేలా చేస్తోంది. ఓ వ్యక్తి పార్కింగ్‌లో ఉన్న ఆటోను (Auto) స్టార్ట్ చేసి బయటికి వెళ్తున్నాడు. అయితే ఆటో పక్కనే ఓ సైకిల్‌ను కూడా పార్క్ చేసి ఉంటారు. ఆటో ముందుకు వెళ్లాలంటే.. సైకిల్ అడ్డుగా ఉంది.


ఈ సమయంలో ఎవరైనా.. ఆటో నుంచి కిందకు దిగి.. సైకిల్‌ను పక్కన పెడతారు. అయితే ఇతను మాత్రం అలా చేయలేదు. అసలే బద్ధకస్తుడైన మనోడు.. ఆటో దిగకుండా.. సీట్లో కూర్చునే సైకిల్‌ను పక్కకు జరిపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సైకిల్‌ను పూర్తిగా పక్కకు నెట్టలేక.. కొంచెం జరిపాడు. ఆటో ముందుకు వెళ్లగానే.. సైకిల్‌ టైరు ఇరుక్కుని ఆటో ఆగిపోతుంది. అప్పటికి గానీ తన బద్ధకం వీడని అతను.. ఆ తర్వాత కిందకు దిగి సైకిల్‌ను పక్కకు లాగేశాడు. అయితే సైకిల్‌ను ఇలా పక్కకు లాగగానే.. అలా ఆటో ముందకు కదిలింది. చూస్తుండగానే ఆటో నేరుగా వెళ్లి.. (Auto falls into road side canal ) రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. ఆటోను ఆపాలని వెనుకే పరుగెత్తిన అతను.. చివరకు ఏమీ చేయలేక నిస్సహాయంగా నిలబడిపోయాడు.


ఇలా ఆ ఆటో డ్రైవర్ బద్ధకం కారణంగా తన ఆటో ప్రమాదానికి కారణమయ్యాడన్నమాట. అదే ముందే ఒక్క నిముషం.. ఆటో నుంచి కిందకు దిగి సైకిల్‌ను పక్కకు తీసి ఉంటే.. ఈ ప్రమాదం జరిగి ఉండేదే కాదు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అక్కడ ఏ సమస్య లేకున్నా కూడా... అతనే సమస్యను క్రియేట్ చేశాడు’.. అంటూ కొందరు, ‘సోమరితనానికి తప్పదు భారీ మూల్యం’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 600కి పైగా లైక్‌లు, 77 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

పడేసిన ప్లాస్టిక్ బాటిల్‌ను ఇంతకంటే బాగా ఎవరూ వాడలేరేమో..

ఈ విద్యార్థులను పట్టుకోవడం ఎవరితరమూ కాదేమో.. ఎలా కాపీ కొడుతున్నారో చూడండి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 28 , 2025 | 05:02 PM