Viral News: ఇంటి ముందు బావి తవ్వుతుండగా జిగేల్‌మన్న కళ్లు.. ఏముందా అని చూడగా..
ABN , Publish Date - Nov 27 , 2025 | 05:25 PM
ఓ వ్యక్తి తన ఇంటికి సమీపంలో బావి తవ్వుతున్నాడు. అయితే సగం తవ్వగానే అతడికి మట్టిలో ఓ పెద్ద రాయి మెరుస్తూ కనిపించింది. అదేదో రాయి అనుకుని అతను బయటికి తీసి పక్కన పెట్టాడు. అయితే ..
అదృష్టం అనేది డబ్బున్న వారిదే అనుకుంటే పొరపాటే. అప్పుడప్పుడూ ఇది పేదవారిని కూడా పలకరిస్తుంటుంది. అది తలుపు తట్టినపుడు తీసిన వారి పంట పండిస్తుంటుంది. చాలా మంది పేద వారు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిన వార్తలు నిత్యం వింటూనే ఉంటాం. కొందరు లాటరీ ద్వారా మరికొందరు బంగారు నాణేలు దొరకడం వల్ల ఉన్నట్టుండి కుబేరులుగా మారిపోతుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ వ్యక్తి ఇలాగే రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. బావి తవ్వుతుండగా.. అతడికి కళ్లు మిరుమిట్లుగొలిపే సీన్ కనిపించింది. ఏంటా అని బయటికి తీసి చూసి షాక్ అయ్యాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
2021లో చోటు చేటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వార్త (Viral News).. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన శ్రీలంకలో (Sri Lanka) చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇంటికి సమీపంలో బావి తవ్వుతున్నాడు. అయితే సగం తవ్వగానే అతడికి మట్టిలో ఓ పెద్ద రాయి మెరుస్తూ కనిపించింది. అదేదో రాయి అనుకుని అతను బయటికి తీసి పక్కన పెట్టాడు. అయితే ఆ తర్వాత అనుమానం వచ్చి సంబంధిత అధికారులకు తెలియజేశాడు. వారు అక్కడికి చేరుకుని దాని పరిశీలించి షాక్ అయ్యారు. అది సాధారణ రాయి కాదని.. ప్రపంచంలోనే అరుదుగా దొరికే నీలమణి రాయిగా (Sapphire stone) గుర్తించారు.

ఆ వస్తువు ప్రపంచంలోనే ఇప్పటివరకు కనుగొనబడిన అతిపెద్ద నీలమణి రాయి తప్ప మరొకటి కాదు. దీని బరువు 2.5 మిలియన్ క్యారెట్లు లేదా దాదాపు 510 కిలోలు ఉన్నట్లు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ నిపుణులు దీని విలువ దాదాపు US$100 మిలియన్లు (సుమారు రూ. 8,92,65,00,000)గా ఉంటందని అంచనా వేశారు. అలాగే వివిధ నివేదికల ప్రకారం ఆ రాయి ధర 7 నుంచి 10 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా. మరోవైపు శ్రీలంకకు సంబంధించిన రత్నాలు, ఆభరణాల అథారిటీ అధికారులు కూడా ఈ రాయిని పరిశీలించారు. ఈ రాయి ప్రపంచంలోనే అతిపెద్ద నక్షత్ర నీలమణి అని వారు పేర్కొన్నారు.
ఈ రాయి ప్రత్యేకత ఇదే..
ఈ నీలమణి రాయికి ఓ ప్రత్యేకత ఉంది. కాంతి ఈ రాయిని తాకినప్పుడు అది ఆరు కిరణాల నక్షత్రంలా మెరుస్తుంది. ఈ రాయికి రెండు వైపులా నక్షత్రం వంటి ఆకారం కూడా ఉంటుంది. ఇది చాలా అరుదైన రాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఘటన నాలుగేళ్ల కిందట చోటుచేసుకున్నా కూడా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పడేసిన ప్లాస్టిక్ బాటిల్‌ను ఇంతకంటే బాగా ఎవరూ వాడలేరేమో..
ఈ విద్యార్థులను పట్టుకోవడం ఎవరితరమూ కాదేమో.. ఎలా కాపీ కొడుతున్నారో చూడండి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి