Home » Road Accident
చెల్లకెర పట్టణ సమీపంలోని స్టేట్ హైవే 150ఏ పై కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో అక్కాతమ్ముడు దుర్మరణం చెందారు. చెల్లకెర పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం చెల్లకెర తాలూకా తలకు గ్రామ పంచాయతీ సభ్యుడు రవికుమార్ భార్య మంజుల(32) ఆమె తమ్ముడు అభిషేక్(28) ఇద్దరూ ద్విచక్రవాహణంలో దేవరకోట మొరార్జీ స్కూల్‌కు వెళ్తున్నారు.
ఝార్ఖండ్‌లోని దేవగఢ్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కన్వర్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును ఓ
జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్‌ను బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో మొత్తం 18 మంది మృతి చెందారు. శ్రావణ మాసం కావడంతో ఉత్తరాది రాష్ట్రాల భక్తులు కన్వర్ యాత్రకు బయలుదేరారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
కూతురికి కాలేజీకి టైం అవుతోంది. సమయానికి అందుబాటులో ఉన్న తండ్రి.. కూతురిని బైకుపై ఎక్కించుకుని బయలుదేరాడు. గమ్యస్థానికి చేరుకునేలోపే వారిపై విధి కన్నెర్ర చేసింది. దీంతో కాసేపట్లో కాలేజీ క్లాస్‌రూంలో అడుగుపెట్టాల్సిన యువతి.. తిరిగిరానిలోకాలకు చేరుకుంది.
లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు. హైదరాబాద్ పరిధి చౌటుప్పల్ మండలం కౌతాపురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి-అద్దంకి రాష్ట్ర రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి, జీవీఆర్ కల్చరల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గుదిబండి వెంకటరెడ్డి (84) మృతిచెందారు.
గద్వాల జిల్లాలోని ధరూరు మండలం రేవులపల్లి వద్దగల జూరాల ప్రాజెక్టుపై ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకులపైకి కారు దూసుకురావడంతో ఇద్దరిలో ఓ యువకుడు ఎగిరి డ్యాంలో పడి గల్లంతయ్యాడు.
రోడ్డు ప్రమాదంలో బత్తుల బ్రహ్మయ్య, నాగమూర్తమ్మ, రమణ, ముత్యాలమ్మ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బాధిత కుటుంబసభ్యులు, బంధువులకు సమాచారం అందించారు.