Alluri District Tragedy: అల్లూరి జిల్లాలో విషాదం.. లోయలో పడిపోయిన ట్రావెల్ బస్సు..
ABN , Publish Date - Dec 12 , 2025 | 06:22 AM
అల్లూరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ట్రావెల్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. చింతూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అల్లూరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ట్రావెల్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో 8 మంది ప్రయాణీకులు మృతిచెందగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లా బస్సు భద్రాచలం నుంచి అన్నవరం వెళుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే చింతూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో 30 మంది బస్సులో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి...
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్‌లో చోటుచేసుకున్న బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళుతున్న ప్రైవేటు బస్సు లోయలో పడిన ఘటనలో పలువురు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదం, క్షతగాత్రులకు అందుతున్న సాయంపై అధికారులతో మాట్లాడారు. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణీకులు ఉన్నారని, పలువురు మృతి చెందగా గాయపడిన వారిని చింతూరు ఆసుపత్రికి తరలించామని అధికారులు ముఖ్యమంత్రి తెలియజేశారు.
ఇవి కూడా చదవండి
ఇండిగో సంక్షోభం.. ఎయిర్‌పోర్టులకు పరుపుతో వెళుతున్న ప్రయాణీకులు..
దువ్వాడ మాధురి శ్రీనివాస్‌కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..