Share News

Secunderabad-Anakapalle: సికింద్రాబాద్‌-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Nov 27 , 2025 | 07:05 AM

సికింద్రాబాద్‌-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. డిసెంబరు 4నుంచి వచ్చే ఏడాది మార్చి 26 వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతాయని తెలిపారు.

Secunderabad-Anakapalle: సికింద్రాబాద్‌-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌ సిటీ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్‌-అనకాపల్లి(Secunderabad-Anakapalle) మార్గంలో 34 ప్రత్యేకరైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. డిసెంబరు 4నుంచి వచ్చే ఏడాది మార్చి 26 వరకు సికింద్రాబాద్‌ నుంచి ప్రతి గురువారం సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేకరైలు(07055 నెంబర్‌) అనకాపల్లికి బయల్దేరనుంది. డిసెంబరు 5వ తేదీ నుంచి మార్చి 27 వరకు ప్రతీ శుక్రవారం అనకాపల్లి నుంచి ప్రత్యేక రైలు ( 07056 నెంబర్‌) నడుస్తాయని తెలిపారు.


city2.2.jpg

మార్గమధ్యంలో చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ(Cherlapalli, Nalgonda, Miryalaguda), నడికూడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని(Rajahmundry, Samarlakota, Annavaram, Tuni), ఎలమంచిలి స్టేషన్లలో ఆగుతాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.


city2.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..

మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 27 , 2025 | 07:05 AM