Home » Anakapalli
గత జగన్ పాలనలో రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా ఏరులై పారేదని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. గంజాయి కేసుల్లో పట్టుబడితే సంక్షేమ పథకాలు రద్దు చేస్తున్నామని ఉద్గాటించారు. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చుదామని దిశానిర్దేశం చేశారు. విద్యరంగానికి తమ ప్రభుత్వం అనేక రకాలుగా ప్రోత్సాహం అందిస్తోందని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు.
Anitha Dharmavaram Visit: ఇప్పుడు ఎన్నికలు లేవని - ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడానికి ధర్మవరం వచ్చినట్లు హోంమంత్రి అనిత చెప్పారు. ధర్మవరం గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో సర్పంచ్‌లకు అధికారాలు లేవని అన్నారు.
Yoga Event: హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ పర్యాటక ప్రాంతమైన రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించిన నాయకులు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు అని అన్నారు.
Parawada Pharma Accident: అనకాపల్లి జిల్లా, పరవాడ ఫార్మాసిటీలో దుర్ఘటన సంభవించింది. కంపెనీలోని ఎస్ఎస్ (సాయి శ్రేయస్) ఫార్మా కంపెనీలో బుధవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. విషవాయువు లీకై ఇద్దరు కార్మికులు మృతి చెందారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కేంద్రంగా అమెరికా పౌరులను టార్గెట్ చేస్తూ సైబర్ మోసాలు చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీఓఐపీ కాల్స్ ద్వారా అమెజాన్ కస్టమర్లను మోసం చేసి కోట్లు కాజేశారు.
కూటమి ప్రుభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో జరిగిన పాపాలను పోలీసులు ఇప్పుడు బయటకు తీస్తున్నారు. కేసుల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. అనకాపల్లిలో గతంలో టీడీపీ నేతను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో వైసీపీకి చెందిన ముగురిని పోలీసులు అరెస్టు చేశారు.
Yalamanchili Municipal Chairperson: ఎలమంచిలి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై మంగళవారం నాడు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అవిశ్వాస తీర్మాన సందర్భంగా ఎలమంచిలిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అనకాపల్లి జిల్లాలో క్యాప్టివ్ పోర్టు నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ఇండియా లిమిటెడ్ అభ్యర్థన మేరకు 2.9 కిలోమీటర్ల వాటర్‌ఫ్రంట్‌తో పోర్టు నిర్మించేందుకు ఒప్పందం సవరించడంపై నిర్ణయం తీసుకుంది
2015లో ఏడేళ్ల బాలికను బీరు సీసాతో నిందితుడు గొంతుకోసి హత్య చేశాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతనిపై నేరం రుజువు కావడంతో బుధవారం న్యాయస్థానం నిందితుడికి మరణ శిక్ష విధించింది. కాగా చోడవరం కోర్టు చరిత్రలో మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరిచండం ఇదే ప్రథమం.
Nara Lokesh: మంత్రి నారా లోకేష్ మాట ఇచ్చారంటే నెరవేర్చి తీరుతున్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారా లోకేష్ వడివడిగా హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలతో మంత్రి నారా లోకేష్ శెభాష్ అనిపించుకుంటున్నారు.