Nara Lokesh- Teacher: మాస్టార్‌ని ఆకాశానికెత్తిన నారా లోకేష్
ABN , Publish Date - Nov 16 , 2025 | 04:00 PM
ఉపాధ్యాయులుగా చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించడమనేది ఒక అరుదైన అవకాశం. అయితే, ప్రస్తుత ప్రభుత్వ టీచర్లు ఏ మేరకు తమ ఉద్యోగ ధర్మాన్ని దృఢ సంకల్పంతో నిర్వర్తిస్తున్నారనే దానిపై బేధాభిప్రాయాలు ఉన్నాయి.. అయితే,
ఇంటర్నెట్ డెస్క్: ఆ మాస్టారు ఏపీ మంత్రి నారా లోకేష్ మనసుదోచారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడానికి సదరు మాస్టారు ఎంచుకున్న విధానం మంత్రి నారా లోకేష్‌ను బాగా ఆకట్టుకుంది. పిల్లలతో ఆడుతూ పాడుతూ, పునాది అభ్యసనాల(బేసిక్ ఫౌండేషన్) ద్వారా విద్యా వికాసానికి పాటుపడుతున్న ఆయన్ని ఇవాళ(ఆదివారం) ప్రత్యేకంగా అభినందించారు మంత్రి లోకేష్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.
ఈ సందర్భంలో నారా లోకేష్ ఏమన్నారంటే, 'అనకాపల్లి జిల్లా, పరవాడ మండలం, బాపడుపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సింగిల్ టీచర్ కొరుపోలు గంగాధర్ మాస్టారికి అభినందనలు. పురాతన వస్తువులు సేకరించి, ‘GR.Antiques’ పేరుతో బడిలో ప్రదర్శించి.. వాటి చరిత్రను, ఉపయోగాన్ని పిల్లలకు వివరించిన తీరు బాగుంది మాస్టారు. వినూత్న బోధనా పద్ధతులు, విద్యార్థుల అభ్యసనాలను లక్షలాది ఫాలోవర్లు ఉన్న మీ GR.Antiques సోషల్ మీడియా అక్కౌంట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారని తెలిసి చాలా సంతోషించాను. మీ కృషి మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది మాస్టారు.' అని నారా లోకేష్ సదరు మాస్టారుని ప్రోత్సహించే ప్రయత్నం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: రండి బాబూ రండి.. చౌక ధర.. ఐదొందలు టికెట్ కొనుక్కో.. ఐదు కోట్ల ఇంటిని సొంతం చేసుకో..
KTR petition: తెలంగాణ స్పీకర్‌పై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్.. రేపు విచారణ