Share News

Vande Bharat Express: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌కు 20 బోగీలు

ABN , Publish Date - Nov 25 , 2025 | 06:45 AM

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బుధవారం నుంచి 20 బోగీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు అదనంగా మరో 312 సీట్లు ప్రయాణికులకు అందుబాట్లోకి రానున్నాయి.

Vande Bharat Express: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌కు 20 బోగీలు

- కొత్తగా 4ఏసీ చైర్‌కార్లు

- అందుబాటులోకి 312 అదనపు సీట్లు

హైదరాబాద్‌ సిటీ: సికింద్రాబాద్‌-తిరుపతి(Secunderabad-Tirupati) మార్గంలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ బుధవారం నుంచి 20 బోగీలతో పరుగులు పెట్టనుంది. ప్రస్తుతం 2 ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌, 14 ఏసీ చైర్‌కార్‌లతో కలిపి మొత్తం 16బోగీలతో నడుస్తున్న వందేభారత్‌కు అదనంగా మరో 4 ఏసీ చైర్‌కార్లను శాశ్వత ప్రాతిపదికన జత చేయాలని దక్షిణమధ్యరైల్వే(South Central Railway) నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు అదనంగా మరో 312 సీట్లు ప్రయాణికులకు అందుబాట్లోకి రానున్నాయి. కాగా, ఈ మార్గంలో వందేభారత్‌కు స్టాపేజీలు, వేళల్లో ఎటువంటి మార్పులేదని సీపీఆర్‌ఓ శ్రీధర్‌(CPRO Sridhar) వెల్లడించారు.


city1.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి.. పసిడి, వెండి ధరల్లో కోత

అది బూటకపు ఎన్‌కౌంటర్‌: ఈశ్వరయ్య

Read Latest Telangana News and National News

city1.3.jpg

Updated Date - Nov 25 , 2025 | 06:45 AM