Home » Tirupati
రానున్న రెండు మూడేళ్ల వ్యవధిలో రూ.1882.65 కోట్ల పెట్టుబడులతో ఫార్మా, ఎలకా్ట్రనిక్స్ పరిశ్రమలతో పాటు రెండు స్టార్ హోటళ్లు జిల్లాలో ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 3728 మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
తిరుపతి నుంచి ఇండిగో విమానాలన్నీ నడుస్తున్నాయని, ఎటువంటి ఇబ్బందులు లేవని తిరుపతి ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ డి.భూమినాథన్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇండిగోకు చెందిన అన్ని విమానాలూ తిరుపతి నుంచి షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయన్నారు.
గత వైసీపీ హయాంలో శ్రీవారి ప్రసాదానికి వినియోగించిన నెయ్యి కల్తీ.. పరకామణిలో చోరీ కేసు రాజీ.. చివరికి శ్రీవారిని దర్శించే ప్రముఖులు, భక్తులకు కప్పే పట్టువస్త్రాల కొనుగోలులోనూ దగా.. పట్టు పేరిట పాలిస్టర్ వస్ర్తాలు కొనుగోలు చేసి మోసం చేశారు.
ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో.. హైదరాబాద్-తిరుపతి ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 11వ తేదీన ఈ రైలును నడుపుతున్నట్లు తెలిపింది. అలాగే.. చర్లపల్లి-మంగళూరు జంక్షన్, మంగళూరు సెంట్రల్-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది.
టీటీడీలో ఇటీవల వెలుగుచూసిన పట్టువస్త్రం స్కామ్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. నకిలీ పట్టు దుపట్టాకు సంబంధించి రూ.54 కోట్ల మోసం బయటపడిందని మీడియా వేదికగా వెల్లడించారాయన.
ఓ అంధ విద్యార్థి స్కేటింగ్‌లో అత్యంత ప్రతిభ కనబరిచి పలువురి చేత ప్రశంసలందుకుంటున్నాడు. 20.30 గంటల్లో 203 కిలోమీటర్లు స్కేటింగ్ చేశాడు. కంటి చూపు లేకపోయినా అత్యంత ప్రతిభ కనబరిచిన అతడిని పలువురు అభినందిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.
తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీకి వీక్లీ రైలును రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. ఈ రెండు ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య వీక్లీ రైలు ఏర్పాటుచేయడం వల్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరైలు మంగళవారం నుంచి ప్రారంభమైంది.
తిరుపతిలోని ఓ ప్రైవేటు కాలేజ్ భవనంపై నుంచి పడి విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విద్యార్థికి చికిత్స కొనసాగుతోంది.
తిరుపతి జాతీయ సంస్కృత యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి కేసులో ఇద్దరు ప్రొఫెసర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. అంతకముందు.. ఒడిశాలో బాధితురాలిని విచారించిన అనంతరం ఈ చర్యలు చేపట్టారు.
తిరుపతిలో ఫుడ్ కోర్ట్‌కు ఏర్పాటుకు మార్గం సుగుమం అయింది. మొత్తం ఈ ఫుడ్ కోర్ట్‌లో 40 నుంచి 50 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దీన్ని వీలైనంత తొందరగా నిర్మింపజేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పట్లు చేస్తున్నారు. నిత్యం వేల సంఖ్యలో భక్తలు తిరుపతికి విచ్చేస్తుంటారు.